ఆకట్టుకున్న నాని నిర్మాణంలో వస్తున్న మూవీ ఫస్ట్ లుక్

నేచురల్ స్టార్ నాని హీరోగా క్షణం తీరికలేకుండా ఉన్నారు. వరుసగా విజయాలు అందుకుంటూ.. చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు మరో బాధ్యతను అందుకున్నారు. నిర్మాతగా మారారు. ఎందుకు మారారో సంగతిని కూడా ఓ వీడియో ద్వారా బయటపెట్టారు. ‘ఈ ఏడాది బిగినింగ్‌లో ప్రశాంత్ అనే అబ్బాయి ఓ కథతో నా దగ్గరకు వచ్చాడు. ఆ కథలో చిన్న పాత్రకు నన్ను వాయిస్ ఓవర్ అడిగాడు. కథ చాలా డిఫరెంట్‌గా అనిపించింది. ఆ టైంలో ఇలాంటి కథకు సరైన టీం.. సపోర్ట్ చాలా అవసరం అనిపించింది. ఈ మూవీని ఇంతకీ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు బయ్యా.. అని అడిగా, ఇంకా ఎవరూ లేరు.. ఎలాగోలా మేనేజ్ చేస్తా అన్నాడు.

మేనేజ్ చేసే సినిమా కాదు ఇది. బాగా చేయాలి అంటూ ఈ సినిమాను నేనే ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదని నేనే రంగంలోకి దిగా” అంటూ ప్రొడ్యుసర్‌గా తన కొత్త సినిమా విశేషాల్ని వివరించారు. ఆ సినిమా ఫస్ట్ లుక్ నేడు రిలీజ్ అయింది. “అ” అనే టైటిల్ తో డిఫెరెంట్ గా పోస్టర్ ని డిజైన్ చేశారు. అంతేకాదు క్యాప్చన్ కూడా “ప్రపంచంలో నేను .. నాలోని ప్రపంచం” అంటూ ఆకట్టుకున్నారు. ఈ ఫస్ట్ లుక్ చిత్రంపై అంచనాలను పెంచింది. అంతేకాదు ఇందులో నిత్యా మీనన్, శ్రీనివాస్ అవసరాల, రెజినా, కాజల్ అగర్వాల్ లు స్పెషల్ రోల్స్ పోషిస్తుండడం ఈ చిత్రంపై ఆసక్తిని మరింత పెంచింది .

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus