Bigg Boss 7 Telugu: నాగార్జున పై ఆడియన్స్ ఫైర్..! శనివారం ఎపిసోడ్ లో సుత్తి ఎందుకు ?

బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ చేస్తున్న మిస్టేక్స్ ని శనివారం హోస్ట్ వచ్చి కడిగిపారేస్తుంటాడు. ఈ ఎపిసోడ్ కోసమే బిగ్ బాస్ లవర్స్ అందరూ ఎంతగానో వెయిట్ చేస్తుంటారు. అలాగే, హౌస్ మేట్స్ కూడా వారం వారం నాగార్జున కోసమే వెయిట్ చేస్తుంటారు. ఆయనకి అన్ని కంప్లైట్స్ చెప్పుకుందాం అని అనుకుంటారు. కానీ, ఈసీజన్ లో అందరూ హౌస్ మేట్స్ చాలా స్మార్ట్ గేమ్ ఆడుతున్నారు. ఎవరికీ దొరక్కుండా స్ట్రాటజీలు ప్లే చేస్తున్నారు. అయితే, హోస్ట్ నాగార్జున శనివారం ఎపిసోడ్ లో ఇచ్చిన క్లాస్ సరిపోలేదని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అసలు లవ్ ట్రాక్స్ ని మళ్లీ ఎంకరేజ్ చేస్తున్నారని, అదే పాయింట్స్ ట్రిగ్గర్ చేస్తున్నారని చెప్తున్నారు. అలాగే, హౌస్ లో హౌస్ మేట్స్ కి ఫుల్ గా ఇచ్చిపారేయాలని అప్పుడు వాళ్లకి ఆడియన్స్ పాయింట్స్ అర్ధమవుతాయని అంటున్నారు. అసలు రెండోవారం శనివారం ఎపిసోడ్ లో పార్టిసిపెంట్స్ కి ఇచ్చిన డోస్ అస్సలు సరిపోదని చెప్తున్నారు. ఇందులో కొన్ని పాయింట్స్ మనం చూసినట్లయితే..

1. సందీప్ సంచాలక్ గా పైయిల్ అయినా కూడా నాగార్జున గ్రీన్ కలర్ ఇచ్చి కింగ్ మీటర్ లో నువ్వు సూపర్ అంటూ పొగిడారు. అంతేకాదు, తనకి ఇచ్చిన పవర్ అస్త్రాని పొగొట్టుకున్నా కూడా ఏమీ అనకుండా స్వీట్ వార్నింగ్ మాత్రమే ఇచ్చారు. అంతేకాదు, తన బ్యాటరీ కూడా ఒక్క పాయింట్ కూడా తగ్గించలేదు.

2. శివాజీ విషయంలో నాగార్జున చాలా కఠినంగా వ్యవహరించారు. బిగ్ బాస్ టీమ్ ని పదే పదే తలుపులు తీయండి నేను వెళ్లిపోతా అనకూడదని వార్నింగ్ ఇస్తూ ఒక పాయింట్ తన ఇమ్యూనిటీ బ్యాటరీ ఛార్జింగ్ ని సైతం తగ్గించారు. దీన్ని కూడా ఆడియన్స్ తప్పు బడుతున్నారు.

3. ప్రియాంక జైన్ గేమ్ లో ఓడిపోయిందని తెలిసినా కూడా సంచాలక్ కి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వలేదు. అంతేకాదు, పల్లవి ప్రశాంత్ పై విరుచుకుపడ్డ అమర్ ని కూడా వెనకేసుకుని వచ్చారు.

4. అమర్ దీప్ బాత్రూమ్ లో బూతులు తిట్టినా కూడా గేమ్ అదరగొట్టేశావ్ అని కింగ్ మీటర్ లో గ్రీన్ కలర్ ఇచ్చారు. అసలు అమర్ ఈవారం వరెస్ట్ గేమ్ ఆడాడు అయినా కూడా ఇలా చేయడం అనేది కరెక్ట్ గా ఆడియన్స్ కి అనిపించలేదు. ఇది కావాలనే నాగార్జున రివర్స్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారని అభిప్రాయ పడుతున్నారు.

5. రతిక గేమ్ ని సాగదీసినందుకు అస్సలు ఏమీ అనలేదు. అంతేకాదు, ప్రిన్స్ ఓవర్ గా రియాక్ట్ అయినా కూడా మందలించలేదు. అలాగే, పవర్ అస్త్రాన్ని కొట్టేసిన శుభశ్రీ కూడా ఏం సాధిద్దామని తీశావో ముందుగా అడిగి అప్పుడు అది తన దగ్గర ఉంటే ఏం జరుగుతుందనేది చెప్పి ఉండాల్సింది. ఇది కూడా కంప్లీట్ గా నాగార్జున హోస్ట్ గా మిస్ అయ్యారు. అందుకే, ఆడియన్స్ ఫుల్ పైర్ అవుతున్నారు. రెండోవారం ఇలా ఉంటే తర్వాత వారాల్లో గేమ్ మరింత డెప్త్ కి వెళ్తుందని, అప్పుడు ఏం చేస్తారు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక శనివారం ఎపిసోడ్ లో శుక్రవారం ఏం జరిగిందనేది సుత్తి ఎందుకని ? ఇది నాగార్జున ఎంట్రీ కంటే ముందే ప్లే చేస్తే బాగుంటుందని అంటున్నారు ఆడియన్స్.

ఏది ఏమైనా బిగ్ బాస్ వీక్ డేస్ కంటే కూడా వీకెండ్ ఎపిసోడ్ ని ఆడియన్స్ బాగా ఇష్టపడతారు. అందుకే, శనివారం ఎపిసోడ్ మరింత స్ట్రాంగ్ గా ఉండాలని అలా బిగ్ బాస్ డిజైన్ చేసినప్పుడే షో రసవత్తరంగా ఉంటుందని ఆడియన్స్ అభిప్రాయం. అదీ మేటర్

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus