శిల్పాశెట్టిని విమర్శిస్తున్న నెటిజనులు

మనం చేసే పనులకు మార్కులు వేసే టీచర్ గా సోషల్ మీడియా వ్యవహరిస్తోంది. మంచి చేసినా.. చెడు చేసినా బూతద్దం వేసి ప్రపంచానికి చాటుతోంది. ఆ విషయంలో సామాన్యులు.. సెలబ్రిటీలని తేడా లేదు. ఈ రోజు సోషల్ మీడియాలో శిల్పా శెట్టి టాప్ స్థానంలో ఉన్నారు. ఏదో మంచి పని చేసింది అనుకోకండి.. ఫ్యాషన్ ని ఫాలో కావడంలో శృతి మించింది. బాలీవుడ్, టాలీవుడ్ లో తన అందం, నటనతో అఆకట్టుకున్న ఈ బ్యూటీ పెళ్లి తర్వాత బుల్లి తెరకి మాత్రమే పరిమితమయింది. తన కొడుకు వియాన్‌ చూసుకుంటూ గడుపుతోంది. అందులో భాగంగానే తన కొడుకును తీసుకొని ముంబై నగర వీధుల్లో కాసేపు షాపింగ్ చేసింది అప్పుడు ముంబై వాసులు తీసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆ ఫొటోలో శిల్పాశెట్టి చూసి “ఇదేం పోయేం కాలం” అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. పంజాబీ డ్రెస్ వేసుకున్నప్పటికీ కింద ప్యాంటు లేకుండా ఉండడాన్ని తప్పుపడుతున్నారు. పెళ్లి అయిన తర్వాత స్లిమ్ గా ఉండడంలో తప్పులేదు.. కానీ ఇలా ఎక్స్ పోజింగ్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది అయితే శిల్పాశెట్టి డ్రస్ చూస్తే చూడటానికి చాలా అసహ్యంగా ఉంది. నంగీ (నగ్న) జనరేషన్ అంటూ కామెంట్ చేశారు. పై భాగం కంటే కింది భాగం ఫిట్‌గా కనిపిస్తోందని అని తిడుతున్నారు. ఈ ఫ్యాషన్ పై శిల్పా శెట్టి ఏమని వివరణ ఇచ్చుకుంటుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus