Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి.. ఆ రోజు ఢిల్లీ అయి ఉంటే ఎలా ఉండేదో? ఆ ఊహే అదుర్స్‌

తమిళ కథానాయకుడు కార్తి.. గత కొన్ని ఏళ్లుగా ఎక్కడికి వెళ్లినా ఎదురయ్యే ప్రశ్నలు ‘ఖైదీ 2’ ఎప్పుడు? ‘ఢిల్లీని మళ్లీ ఎప్పుడు చూస్తాం?’ అనే. వాటికి ఆయన సమాధానాలు చెప్పలేకపోతున్నాడు. అయినా ఫ్యాన్స్‌, ప్రేక్షకులు అయితే ఆ ప్రశ్నలు వేయడం మానేయడం లేదు. అంతలా ఆ సినిమా కోసం చూస్తున్నారు కదా.. ఆ ఢిల్లీ పాత్ర చేయాల్సింది కార్తి కాదంటే నమ్ముతారా? ఛస్‌.. కార్తి అయితేనే కరెక్ట్‌ అని అంటారు. అయితే ఆ పాత్ర చేయాల్సింది ఎవరో తెలిస్తే కచ్చితంగా మాట మార్చుకుంటారు.

Vijay Sethupathi

ఎందుకంటే ‘ఖైదీ’ సినిమా కథ తొలుత వెళ్లింది లేటెస్ట్‌ తరం వెర్సటైల్‌ నటుడు విజయ్‌ సేతుపతి (వీఎస్‌) కాబట్టి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వీఎస్‌ మాట్లాడుతూ ఈ విషయాల్ని క్లియర్‌గా చెప్పేశాడు. దీంతో విజయ్‌ చేస్తే ఎలా ఉండుండు అనే చర్చ మొదలైంది. ‘ఖైదీ’ సినిమా కథను మొదట విజయ్‌ సేతుపతికే చెప్పి ఆయనతోనే సినిమా చెయ్యాలనుకున్నారట దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్. అయితే కార్తికి ఈ కథ నచ్చేసి తనే వీఎస్‌ను అడిగి మరీ ఈ ప్రాజెక్టును తీసుకున్నాడట.

అయితే ‘ఖైదీ’ సినిమా మిస్ అయినందుకు తానేమీ బాధపడటం లేదని విజయ్‌ అన్నాడు. ‘ఖైదీ’ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిగాయి. కానీ ఫైనల్ అవ్వలేదు. కార్తి నాకు ఫోన్ చేసి, ‘యోవ్ వీఎస్, నేను చేస్తా’ అన్నాడు. దానికి నేను ‘బాగా చేయండి సర్’ అని చెప్పాను అని విజయ్‌ సేతుపతి చెప్పాడు. లోకేశ్‌ నాకు బాగా తెలుసు. కార్తి పట్ల నాకు గౌరవం ఉంది. కథ విన్నప్పుడే ఈ సినిమా విజయం సాధిస్తుందని అర్థమైంది అని వీఎస్‌ చెప్పాడు.

విజయ్‌ సేతుపతి అనుకున్నట్లే ఆ సినిమా మంచి విజయం అందుకుంది. ‘ఖైదీ 2’ కానీ ప్రీక్వెల్‌ కానీ ఉంటుంది అని గత కొన్నేళ్లుగా చెబుతున్నారు. కానీ వివిధ కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ ముందుకు వెళ్లడం లేదు. ప్రస్తుతం లోకేశ్‌.. బన్నీ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు మరి.

 మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus