బాహుబలి తర్వాత టాలీవుడ్ వర్గాలలో హాట్ టాపిక్ అయినా విషయం అవసరాల శ్రీనివాస్ సినిమా. అతను సెక్స్ అడిక్ట్ గా నటించిన బాబు బాగా బిజీ మూవీ ఎలా ఉందో ? అనే విషయాన్నీ పక్కన పెడితే.. అసలు ఆ సినిమా ఎందుకు చేశాడా ? అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే అవసరాల శ్రీనివాస్ అష్టా చెమ్మా సినిమాతో నటుడుగా అడుగుపెట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. రీసెంట్ గా వచ్చిన కంచె, నాన్నకు ప్రేమతో, జెంటిల్ మ్యాన్, అ ఆ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నారు. ఇక దర్శకుడిగా కూడా మంచి హిట్స్ అందుకున్నారు.
శ్రీని దర్శకత్వంలో వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. జ్యో అచ్చుతానంద తన ప్రతిభను బయటపెట్టింది. ఇలా డైరక్టర్ గా, నటుడిగా బిజీగా ఉన్న అవసరాల.. అడల్ట్ కామెడీ మూవీలో నటించడానికి ఒప్పుకునేసరికీ అందరూ ఆశ్చర్యపోయారు. కొత్తదనం చూపిస్తాడేమోనని అనుకున్నారు. తీరా సినిమాకి వెళితే బిజీ బాబు గా అవసరాల ఆకట్టుకోలేకపోయారు. నటుడిగా, దర్శకుడిగా మంచి అవగాహన ఉన్న అవసరాల ఇలాంటి సినిమా ఎలా ఒప్పుకున్నాడని ప్రశ్నిస్తున్నారు. తెలిసి తెలిసి పెద్ద తప్పు చేసాడని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కథల ఎంపికలో జాగ్రత్తగా ఉంటే మంచిదని సలహా ఇస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.