Avatar2 Collections: ‘అవతార్ 2’ 15వ రోజు షాకింగ్ కలెక్షన్లు… ఎంతో తెలుసా..?

2009లో వచ్చిన ‘అవతార్’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 13 ఏళ్ల క్రితమే వందల కోట్లు కలెక్ట్ చేసింది ఆ మూవీ. ఇక దానికి సీక్వెల్ గా ‘అవతార్ 2′(అవతార్ ది వే ఆఫ్ వాటర్) కూడా రాబోతున్నట్టు ప్రకటన వచ్చినప్పటి నుండి సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తితో ఎదురుచూసిన ఈ సినిమా డిసెంబర్ 16 న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. దాదాపు 400 మిలియన్ డాలర్ల భారీ వ్యయంతో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ ఆడియన్స్ ను ఫిదా చేస్తుంది అనే చెప్పాలి.

మొదటి రోజు కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ జనం ఎగబడి ఈ చిత్రాన్ని చూస్తున్నారు.కొత్త సినిమాలు రిలీజ్ అయినా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ దూకుడు తగ్గలేదు. రెండో వారం కూడా చాలా బాగా కలెక్ట్ చేసుకుంది.15 రోజున కూడా సూపర్ గా కలెక్ట్ చేసింది. నిన్నటితో ఈ మూవీ ఇండియా వైడ్ గా రూ.300.90 కోట్ల నెట్ కలెక్షన్లను,రూ.347.88 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 15 రోజుల కలెక్షన్లను గమనిస్తే :

నైజాం 26.84 cr
సీడెడ్ 5.88 cr
ఉత్తరాంధ్ర 6.66 cr
ఈస్ట్+ వెస్ట్ 2.91 cr
కృష్ణా +గుంటూరు 5.46 cr
నెల్లూరు 2.51 cr
ఏపీ + తెలంగాణ 50.26 cr

‘అవతార్ 2’ (అవతార్ ది వే ఆఫ్ వాటర్) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. చాలా ఏరియాల్లో రెంటల్ బేసిస్ మీద ఓన్ రిలీజ్ చేసుకున్నారు. దీంతో రూ.5.25 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన సంగతి తెలిసిందే. ఇక 15 రోజులు పూర్తయ్యేసరికి రూ.50.26 కోట్ల భారీ షేర్ ని కలెక్ట్ చేసింది ‘అవతార్ 2’.

దీంతో బయ్యర్లు రూ.45.01 కోట్ల భారీ లాభాలను అందించింది. ‘ధమాకా’ ’18 పేజెస్’ మూవీస్ రిలీజ్ అయినా ఈ మూవీ ఇలా కలెక్ట్ చేస్తుండడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. 3వ వీకెండ్ ను కూడా ఈ మూవీ బాగా క్యాష్ చేసుకునే అవకాశం ఉంది.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus