Avatar2: అవతార్2 ఫ్యాన్స్ కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే!

  • December 16, 2022 / 08:48 PM IST

జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో తెరకెక్కిన అవతార్2 సినిమా మార్నింగ్ షో నుంచి రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందే పైరసీ బారిన పడటం అవతార్2 మేకర్స్ ను తెగ టెన్షన్ పెట్టింది. అయితే కొంతమంది మాత్రం బుద్ధున్నోళ్లు అవతార్2 మూవీని పైరసీలో చూస్తారా? అని కామెంట్లు చేశారు. అయితే చివరకు ఆ కామెంట్లు నిజమయ్యే విధంగా ఉన్నాయి.

అవతార్2 మూవీని థియేటర్లలో చూసిన ప్రేక్షకులు ఈ సినిమాను మొబైల్ లో చూసినా ఏ మాత్రం లాభం ఉండదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అవతార్2 మూవీపై రిలీజ్ కు ముందు నెగిటివ్ కామెంట్లు వినిపించినా సినిమా విడుదలైన తర్వాత ఆ అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి ఎక్కడా నెగిటివిటీ లేదనే సంగతి తెలిసిందే. అవతార్2 చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తోంది.

అవతార్2 సక్సెస్ సాధించడంతో భవిష్యత్తులో మరిన్ని భారీ బడ్జెట్ సినిమాల దిశగా అడుగులు పడుతున్నాయి. జేమ్స్ కామెరూన్ తన ప్రతిభతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంది. మన దేశం నుంచి ఈ సినిమా 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని మరి కొందరు చెబుతున్నారు.

అవతార్2 సాధించే రికార్డులు ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరచడం గ్యారంటీ అని మరి కొందరు చెబుతున్నారు. అవతార్2 మూవీ కథ, కథనం అద్భుతంగా ఉన్నాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus