Avatar2 Collections: మొదటి రోజే బ్రేక్ ఈవెన్ కొట్టేసిన ‘అవతార్ 2’

Advertisement

2009 లో వచ్చిన ‘అవతార్’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 13 ఏళ్ల క్రితమే వందల కోట్లు కలెక్ట్ చేసింది ఆ మూవీ. ఇక దానికి సీక్వెల్ గా ‘అవతార్2′(అవతార్ ది వే ఆఫ్ వాటర్) కూడా రాబోతున్నట్టు ప్రకటన వచ్చినప్పటి నుండి సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రపంచం మొత్తం ఎంతో ఆత్రంగా ఎదురుచూసిన ఈ సినిమా నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

దాదాపు 400 మిలియన్ డాలర్ల భారీ వ్యయంతో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ ఆడియన్స్ ను ఫిదా చేస్తుంది అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మొదటి రోజు భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 4.48 cr
సీడెడ్ 1.02 cr
ఉత్తరాంధ్ర 1.28 cr
ఈస్ట్+ వెస్ట్ 0.62 cr
కృష్ణా +గుంటూరు 1.10 cr
నెల్లూరు 0.30 cr
ఏపీ + తెలంగాణ 8.80 cr

‘అవతార్2’ (అవతార్ ది వే ఆఫ్ వాటర్) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. చాలా ఏరియాల్లో రెంటల్ బేసిస్ మీద ఓన్ రిలీజ్ చేసుకున్నారు. దీంతో రూ.5.25 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ మొదటి రోజే రూ.8.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ సాధించింది. అప్పుడే రూ.3.55 కోట్ల లాభాలను కూడా అందించింది ఈ మూవీ.

కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ‘అవతార్2’ కి ఈ రేంజ్లో ఓపెనింగ్స్ రావడం అంటే మామూలు విషయం కాదు.శని, ఆదివారాల్లో కూడా బుకింగ్స్ భారీగా జరిగే అవకాశం ఉంది. వీకెండ్ ముగిసేసరికి ఈ మూవీ ఏ రేంజ్లో కలెక్ట్ చేస్తుందో చూడాలి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus