‘చిన్నారి పెళ్లికూతురు’ అనే హిందీ డబ్బింగ్ సీరియల్ తో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది అవికా గోర్. ఇందుకేనేమో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం చేసారు నాగార్జున,సురేష్ బాబు. ‘ఉయ్యాలా జంపాల’ చిత్రం హీరోగా పరిచయమైనా ఈ భామ… ఆ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో అవికా కు తెలుగులో వరుస అవకాశాలు దక్కాయి. వెంటనే నాగశౌర్య హీరోగా వచ్చిన ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. అయితే ఆ చిత్రం పెద్దగా ఆడలేదు.
కానీ అటుతరువాత వచ్చిన ‘సినిమా చూపిస్తా మావ’ ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ చిత్రాలు బాగా ఆడాయి. దీంతో మరిన్ని అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినప్పటికీ ఈ భామ రిజెక్ట్ చేస్తూ వచ్చింది. ఇప్పటివరకూ మరో తెలుగు సినిమాలో నటించలేదు. దీనికి కారణాలేమిటన్నది పెద్దగా బయటకి రాలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ అమ్మడు మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుందట. కాస్త ఒళ్ళు తగ్గించుకుని.. సన్నగా మారిన ఈ అమ్మాయి దిల్ రాజు నిర్మాణంలో రూపొందే చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యిందట. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్నాడు. ‘ఇద్దరి లోకం ఒకటే’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో అవికా ను కూడా హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో పాటూ సాయితేజ్ హీరోగా మారుతి డైరెక్షన్లో రూపొందే చిత్రంలో కూడా ఈ భామ నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. మరి ఈ రీ ఎంట్రీ.. అమ్మడికి ఎంత వరకూ కలిసొస్తుందో చూడాలి..!