ఘనంగా ముక్కు అవినాష్ భార్య సీమంతపు వేడుకలు జరుపుకున్న అనుజా!

బుల్లితెర కార్యక్రమంలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ముక్కు అవినాష్ ఒకరు. జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన అనంతరం బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు. ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

బిగ్ బాస్ తరువాత ఈయన స్టార్ మా లో ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.స్టార్ మా లో ప్రసారమవుతున్నటువంటి స్పెషల్ ఈవెంట్స్ లో పెద్ద ఎత్తున సందడి చేయడమే కాకుండా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అభిమానులను సందడి చేస్తున్నారు. ఇక అవినాష్ భార్య ఆనూజా గురించి అందరికీ సుపరిచితమే.

ఈమె కూడా పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈమె కూడా ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేసేవారు. ఇక అనుజా కూడా అల్లరి అనూజా అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. ఇక పోతే ఈమె ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే సంగతి మనకు తెలిసిందే..ఇక ఈ విషయాన్ని అవినాష్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ప్రస్తుతం ఈమె ఐదవ నెల ప్రెగ్నెంట్ కావడంతో ఘనంగా సీమంతపు వేడుకలను నిర్వహించారు. ఈ క్రమంలోనే అవినాష్ తన భార్య సీమతానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అభిమానులు అవినాష్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus