ప్రివ్యూ నుంచి ‘అ!’కి అదోరకం రెస్పాన్స్

రేపు విడుదలవుతున్న ‘అ!’ చిత్రాన్ని నిన్న సాయంత్రం టాలీవుడ్ సెలబ్రిటీస్ కోసం స్పెషల్ షో వేశారు. అందరూ సినిమా అదుర్స్, బెదుర్స్, కొత్తరకం సినిమా అంటూ సినిమాని ఆకాశానికెత్తేశారు. అయితే.. ఇంకొందరు మాత్రం “సినిమా అందరికీ అర్ధమవ్వదు, ముఖ్యంగా చాలా టిపికల్ స్క్రీన్ ప్లే మరియు చాలా లేయర్స్ ఉన్న స్టోరీ” అంటూ సినిమాకి విపరీతమైన హైప్ ఇవ్వడంతోపాటు రెగ్యులర్ సినిమాల్లా ఈ చిత్రాన్ని చూడకండి అంటూ హింట్ కూడా ఇస్తున్నారు. ఇక నాని ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. “నా జీవితంలో వచ్చిన ప్రతీ రూపాయి సినిమా ఇచ్చిందే.. అలాటప్పుడు ఆ రూపాయి సినిమాలో పెట్టడానికి అస్సలు ఆలోచించాను. ఏదో రూపంలో నాకొచ్చిన డబ్బుని మళ్ళీ సినిమాల్లో పెట్టాలన్నదే నా ఆలోచన. తెలుగులో డిఫెరెంట్ సినిమాలు రావడం లేదు.. ఎవరూ చేయడం లేదు అనుకోవడం కన్నా, మనమే ఎందుకు చేయకూడదు అనుకుని చేసిన సినిమా ఇది.

ఇండస్ట్రీలో ఇలాంటి చేంజ్ అవసరం అనిపించే ఈ సినిమాని నిర్మించాను. మంచి సినిమాలు చేశాను. సాధారణ నటుడి స్థాయి నుండి సినిమా ప్రొడ్యూస్ చేసే స్థాయిలో ఈ రోజు ఉన్నానంటే, దాని వెనకాల చాలా మంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఇప్పుడు నేను నిర్మాతను అయ్యాను కదా అని నా సినిమాలు నేను చేసుకోను… నేనెప్పుడూ అందుబాటులో ఉంటా. సినిమా ఒక పర్టికులర్ ఆడియెన్స్ కి నచ్చుతుంది. అందరికీ నచ్చకపోవచ్చు. ఒక ప్లేట్ లో పాస్తా, బిర్యాని, పప్పన్నం ఎలా సర్వ్ చేయలేమో, అందరికీ ఒకేసారి నచ్చేలా సినిమా చేయలేం… ఎవరినీ టార్గెట్ చేసి సినిమా చేయలేదు.” అంటూ చాలా విశేషాలు చెప్పుకొచ్చారు.
సో, నాని స్వయంగా చెప్పేయడంతో ఇప్పుడు జనాలకి కూడా సినిమాని ఎలా చూడాలి అనే విషయంపై క్లారిటీ వచ్చేస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus