బాలయ్యతో ఆ సీన్లు చేయించి చాలా పెద్ద తప్పు చేశాను : బి.గోపాల్

నందమూరి బాలకృష్ణ అలాగే మాస్ డైరెక్టర్ బి.గోపాల్ కలిసి 5 సినిమాల వరకూ కలిసి పనిచేసారు. ఇందులో 4 సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ లు అయ్యాయి. ఒక్క సినిమా మాత్రం వీరిద్దరి పరువు తీసిపడేసి నవ్వుల పాలు చేసింది. ఆ చిత్రం ఏంటో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదేనండీ ‘పలనాటి బ్రహ్మనాయుడు’ చిత్రం. అప్పట్లో ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది. జయాపజయాలు అనేవి సర్వ సాధారణమైన విషయమే కానీ.. ఆ చిత్రంలో ఉన్న అతి సన్నివేశాలు ‘జై బాలయ్య’ నినాదానికి పునాది వేశాయని చెప్పొచ్చు.

ముఖ్యంగా ఈ చిత్రంలో తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోవడం, విలన్ కూర్చున్న.. కుర్చీ ముందుకు రావడం.. కోడిపుంజు మరో విలన్ ని చంపెయ్యడం వంటి సీన్లు ఇప్పటికీ బాలయ్య ఫ్యాన్స్ ను భయపెడుతూనే ఉంటాయి. ఈ సీన్లకి ఎలా ఒప్పుకున్నానో నాకే తెలీదు అంటూ బాలకృష్ణ కూడా ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ సీన్ల గురించి.. ఆ చిత్రం దర్శకుడు బి.గోపాల్ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. ” ఆ సీన్లకి రైటర్ల తప్పేమీ లేదు. తప్పంతా నాదే. నేను ఆ సీన్లు చిత్రీకరించి ఇంకా పెద్ద తప్పు చేశాను. అందులో తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్ళడం వంటి సన్నివేశాలు పెట్టకుండా ఉండాల్సింది. ఇప్పటికీ అవి నన్ను బాధపెడుతూనే ఉన్నాయి. వాటి వల్ల విమర్శల పాలయ్యాము. అయితే మా బాలయ్య బాబు మాత్రం బంగారం. నేను చెప్పింది గుడ్డిగా చేసేసాడు. డైరెక్టర్లు ఏమి చెబితే అది.. గుడ్డిగా నమ్మి చేసేస్తాడు” అంటూ చెప్పుకొచ్చారు బి.గోపాల్.

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus