బాహుబలి లో ని సీన్ స్పూఫ్ కూడా హిట్టే..!!

  • July 12, 2016 / 09:51 AM IST

విజయవంతమైన సినిమాలోని పాత్రలను, సీన్లకు ఇతర చిత్రాల్లో స్పూఫ్ చేయడం ఎప్పటినుంచో జరుగుతోంది. వీటిని కామెడీని పండించడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కొన్ని పేలుతుంటాయి.. మరికొన్ని తుస్సుమంటాయి. అయితే ప్రపంచ సినీ అభిమానులను మెప్పించిన ఎస్.ఎస్.రాజమౌళి కళా ఖండం “బాహుబలి” లోని సీన్లు స్పూఫ్ గా వచ్చినా చప్పట్లు అందుకుంటున్నాయి. ఈ సినిమాలో మహేంద్ర బాహుబలి శిశువుగా ఉన్నప్పుడు అతని కాలిని తన తల పైన కట్టప్ప పెట్టుకుంటాడు. మళ్లీ శివుడిగా పెరిగిన బాహుబలి ని గుర్తించినప్పుడు అదే విధంగా చేస్తాడు. ఈ సీన్లు ఎమోషన్ ను తీసుకొచ్చాయి.

సినిమా చూసిన ప్రతిఒక్కరి మదిలో ఈ సన్నివేశం ముద్రవేసుకుంది. ఆ సీన్ ను తమ సినిమాలో స్పూఫ్ చేయడానికి డైరక్టర్లు సంకోచించడంలేదు. యువ హీరో సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం సుప్రీమ్ లో ఈ సీన్ స్పూఫ్ బాగా ఆకట్టుకుంది. ఇందులో పోలీస్ అయినా వెన్నెల కిషోర్ తన పై అధికారి రాశీ ఖన్నా కాలుని తన తల పై పెట్టుకుంటాడు. ఇది థియేటర్లలో విజిల్స్ వేయించింది. దర్శకుడు అనిల్ రావిపూడి సందర్భానుసారంగా బాహుబలి స్పూఫ్ ని చిత్రీకరించడంలో విజయవంతమయ్యారు.

మళ్ళీ ఇదే స్పూఫ్ ని డైరక్టర్ ఈశ్వర్ రెడ్డి తన సెల్ఫీ రాజా సినిమాలో పెట్టారు. స్పూఫ్ ల హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ కట్టప్ప సీన్ తో తెగ నవ్విస్తారని చిత్ర బృందం చెప్పింది. ఈ నెల 15 న విడుదల కానున్న ఈ సినిమా ప్రచార చిత్రాల్లో ఈ స్పూఫ్ ఫోటోను వినియోగిస్తున్నారు. ఇందులో ఆ సీన్ ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus