రాఘవ లారెన్స్ ‘ముని’ సిరీస్ తరహాలో తమిళంలో ‘ఆరణ్మనై’ సిరీస్ కూడా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్..లో భాగంగా ఆల్రెడీ ‘చంద్రకళ’ ‘కళావతి’ (Aranmanai 2) ‘అంతఃపురం’ (Aranmanai 3) వంటి సినిమాలు వచ్చాయి. ఇందులో ‘చంద్రకళ’ బాగా ఆడింది. ‘కళావతి’ యావరేజ్ గా ఆడింది. ‘అంతఃపురం’ వచ్చి వెళ్లినట్టు తెలుగు ప్రేక్షకులకి తెలిసుండకపోవచ్చు. అయితే ఆ సిరీస్ లో భాగంగానే ఇప్పుడు నాలుగో మూవీ వచ్చింది. తమన్నా (Tamannaah Bhatia) , రాశీఖన్నాల (Raashii Khanna) స్పెషల్ సాంగ్ వల్ల ఈ సినిమా పై జనాల ఫోకస్ పడింది.
సుందర్.సి (Sundar. C) డైరెక్ట్ చేసిన ఈ సినిమా మే 03 న రిలీజ్ అయ్యి నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. తమిళంలో అయితే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తెలుగులో కూడా టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయని చెప్పవచ్చు. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.30 cr |
సీడెడ్ | 0.18 cr |
ఆంధ్ర(టోటల్) | 0.35 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 0.83 cr |
‘బాక్’ (Baak) చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.1.8 కోట్లు. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా రూ.0.83 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.0.97 కోట్లు షేర్ ను రాబట్టాలి. నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఈ మూవీ బాగానే కలెక్ట్ చేసింది అని చెప్పాలి. అయితే వీక్ డేస్ లో కూడా నిలకడగా రాణిస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.