బాబు బంగారం హిట్టేనట!!

టాలీవుడ్ లో సూపర్ సక్సెస్ హీరోగా విక్టరీని తన టైటిల్ గా మార్చుకున్న వెంకటేష్ కరియర్ చివరై దశలో చాలా ఒడిదుడుకుల్లో ఉంది చెప్పాలి, గతం కొంతకాలంగా ఆయన చేస్తున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా చప్పుడు చెయ్యకపోవడంతో వెంకీని దాదాపు అందరూ మరచిపోయారు అని అనిపించింది. కానీ, రాకెట్ స్పీడ్ లో ‘బాబు బంగారం’తో దూసుకువచ్చాడు వెంకీ.

ఈ సినిమా తొలి రోజు నుంచి మిక్స్డ్ టాక్ ను సంపాదించుకోవడంతో ఈ సినిమా కూడా ఫ్లాప్ అయిపోతుందేమొ నై కంగారు పడ్డారు అందరూ…కానీ ఈ సినిమా మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతున్న క్రమంలో ఈ సినిమా బయ్యర్స్ సేఫ్ జోన్ లో ఉన్నారని తెలిసిన తరుణంలో సక్సెస్ మీట్ నిర్వహించింది ఈ చిత్రం యూనిట్. సక్సెస్ మీట్ లో భాగంగా మారుతి మాట్లాడుతూ…ఈ సినిమా గురించి తనదైన శైలిలో వివరిస్తూ…బాబు బంగారం ఫ్యాన్స్-లేడీస్ మాస్ కి బాగా రీచ్ అయింది. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ చూసి డిస్ట్రిబ్యూటర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఏ సినిమాకైనా వసూళ్లే ముఖ్యం.

డబ్బులు రావడం అంటే సినిమా సక్సెస్ సాధించినట్లే. నేను ఇలాంటి  కమర్షియల్ మూవీ చేసే ఛాన్స్ ఇచ్చిన వెంకటేష్ కి థ్యాంక్స్. ఇక ఈ మూవీలో ముఖ్యంగా ఫైటింగ్స్ గురించి చెప్పుకోవాలి. నా సినిమాలో ఇలాంటి ఫైట్స్ ఉన్నాయా అనిపించేలా పైట్స్ తీశారు రామ్ లక్ష్మణ్’ అని చెప్పాడు మారుతి. అంతేకాకుండా ఫ్యామిలీస్ నుంచి ఇంత రెస్పాన్స్ ఎక్స్ పెక్ట్ చేయలేదని అంటున్నాడు. ఈ సినిమాను ఆదరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus