Baby Movie: మీడియా ప్రతినిధులపై దాడి చేసిన బేబీ నిర్మాత బౌన్సర్స్?

  • August 5, 2023 / 01:40 AM IST

బేబీ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా పేరు మారుమోగిపోతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో సినిమా విడుదలైనప్పటికీ ఆ సినిమా బేబీ సినిమా ముందు ఏమాత్రం నిలబడలేకపోయింది. ఇప్పటికే పలుచోట్ల పవన్ కళ్యాణ్ బ్రో సినిమాని తీసేసి తిరిగి బేబీ సినిమాని వేస్తుండటం గమనార్హం.ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా సాయి రాజేష్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బేబీ. ఈ సినిమాకు ఎస్ కే ఎన్ నిర్మాతగా వ్యవహరించారు.

ఒక చిన్న సినిమాగా (Baby Movie) ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించని స్థాయిలో ఈ సినిమా అద్భుతమైన విజయాలను అందుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఇలా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఇంకా ఈ సినిమా హౌస్ ఫుల్ థియేటర్లతో రన్ అవుతూ ఉండడం విశేషం. ఈ క్రమంలోనే చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను చేస్తూ థియేటర్లను విజిట్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత ఎస్ కే ఎన్ ఆనంద్ దేవరకొండ విరాజ్ అశ్విన్ వైష్ణవి చైతన్య ముగ్గురు కూడా భీమవరం వెళ్లారు. అయితే ఇక్కడికి బేబీ సినిమా యూనిట్ వస్తున్నారన్న విషయం తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అయితే చిత్ర బృందం రాగానే అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు ఈ క్రమంలోనే చిత్ర బృందం కాస్త అత్యుత్సాహం కనబరుస్తూ మీడియా ప్రతినిధులపై దాడి చేశారు.

నిర్మాత ఎస్ కే ఎన్ బౌన్సర్లు మీడియాపై దాడి చేయడంతో ఓ మీడియా ప్రతినిధి తీవ్ర స్థాయిలో గాయపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక నిర్మాత ఎస్ కే ఎన్ సైతం మీడియా ప్రతినిధులతో గొడవ పడుతున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈ వివాదం విమర్శలు చేస్తున్నారు.అసలు చిత్ర బృందం మీడియాతో గొడవ పడడానికి గల కారణం ఏంటో తెలియాల్సి ఉంది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus