ఈ రోజుల్లో ఒక సినిమా హిట్ ఇచ్చాక… మరో సినిమా హిట్ ఇవ్వడమే కష్టమైపోతోంది. హీరోల సంగతి పక్కన పెడితే దర్శకులుకు ఇది మరీ కష్టం. అలాంటి ఒకదాని తర్వాత ఒకటి బ్లాక్‌బస్టర్లు ఇవ్వడం ఇంకా కష్టం. ఇలాంటి పని చేసి చూపిస్తున్నారు దర్శకుడు అట్లీ. షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ లాంటి హిట్ బొమ్మను ఇచ్చిన అట్లీ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో సందడే సందడి. కారణం అతను ఓ హిట్ మెషీన్. అవును మీరు చదివింది నిజమే. కావాలంటే గత సినిమాల లిస్ట్ చూస్తే మీకే అర్థమైపోతుంది.
అట్లీ (Atlee) అసలు పేరు అరుణ్ కుమార్. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. రొమాంటిక్ కామెడీ డ్రామా స్టోరీ ‘రాజా రాణి’తో 2013లో దర్శకుడిగా మారారు. రూ. 25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా దాదాపు రూ. 84 కోట్ల వసూళ్లు చేసింది. అలా ఎంట్రీలో భారీ వసూళ్లు అందుకున్న దర్శకుడు అయ్యారు. ఆ సినిమా తర్వాత విజయ్‌తో వరుసగా మూడు సినిమాలు తెరకెక్కించారు. మూడింటికి మూడు భారీ విజయాలు అందుకున్నాయి.
‘తెరి’ / ‘పోలీసు’ రూ. 75 కోట్ల బడ్జెట్‌తో రూపొంది, రూ. 150 కోట్లు వసూలు చేసింది. ఆ ‘మెర్సల్’ / ‘అదిరింది’తో మళ్లీ వచ్చారు. ఈసారి రూ.120 కోట్లు బడ్జెట్ కాగా, వసూళ్లు రూ. 200 కోట్లు ప్లస్. ముచ్చటగా మూడోసారి ‘బిగిల్’ / ‘విజిల్’తో మోత మోగించారు. రూ. 180 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ. 280 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఇలా వరుసగా భారీ వసూళ్లు అతనికి అలవాటు చేసేసుకున్నారు అట్లీ.
ఆ తర్వాత అట్లీ మీద బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ చూపు పడింది. ఓ ఊర మాస్ సినిమా కావాలని ‘జవాన్’ సినిమా చేశారు. ఈ సినిమా రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. వసూళ్ల లెక్క రూ. 1000 కోట్లు పక్కా అని అప్పుడే మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో వరుస మాస్ స్టఫ్‌తో ఇలాంటి బ్లాక్‌బస్టర్‌లు ఎలా సాధిస్తున్నారో అంటూ అట్లీ గురించి అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ప్రేక్షకుల నాడిని అట్లీ బాగా పసిగట్టారని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. లేకపోతే ఈ విజయాలు రావు కదా.
జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!