సూర్య సినిమాలో కూడా విజయ్ హీరోయినే!

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ ఒకటి. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ కి ఇది చిన సంస్థ లాంటిది. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ లో పూర్తిగా పెద్ద సినిమాలు అందులోనూ దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) సినిమాలే రూపొందుతాయి. ఎస్.రాధాకృష్ణ(చిన్నబాబు) (S. Radha Krishna) ఆ సినిమాలను నిర్మిస్తున్నారు. మిగతా దర్శకుల పెద్ద సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాలు ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ లో రూపొందుతాయి. ఈ బ్యానర్ నుండి ఏడాదికి కనీసం 4 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.

Bhagyashri Borse

ఇటీవల ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) వంటి సినిమాలు వచ్చాయి. త్వరలో ‘మ్యాడ్ స్క్వేర్’ కూడా రాబోతుంది. ‘మ్యాడ్’ హిట్ అవ్వడంతో ‘మ్యాడ్ స్క్వేర్’ పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా.. ‘సితార’ బ్యానర్ గురించి, నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi ) గురించి నిత్యం ఇండస్ట్రీలోనూ సోషల్ మీడియాలోనూ ఓ ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంటుంది. అదేంటంటే.. ఈ బ్యానర్లో ఏ దర్శకుడైనా, హీరో అయినా, హీరో అయినా వెళితే లాక్ అయిపోయినట్టే, అని కొందరు చర్చించుకుంటూ ఉంటారు.

దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) ‘రంగ్ దే’ (Rang De) నుండి ఇక్కడే సినిమాలు చేస్తున్నారు. హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) కూడా రెండు సినిమాలు చేశారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) కూడా అంతే..! ఇప్పుడు ఈ లిస్టులో మరో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) కూడా చేరినట్టు తెలుస్తుంది. విషయం ఏంటంటే.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య (Suriya) హీరోగా ఓ సినిమా ఈ బ్యానర్లో రూపొందనుంది.

ఇందులో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సేని ఫైనల్ చేశారట. ఆల్రెడీ ఇదే బ్యానర్లో ఆమె ‘కింగ్డమ్’ (Kingdom) చేస్తుంది. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఇందులో హీరో. ఇప్పుడు సూర్య సినిమాకి కూడా ఈమెనే ఫైనల్ అయ్యింది. అంతేకాదు ఇదే బ్యానర్లో రూపొందే మరో పెద్ద సినిమాలో కూడా భాగ్యశ్రీ (Bhagyashree Borse) పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోపక్క వెంకీ అట్లూరి- సూర్య సినిమాకి కూడా సంగీత దర్శకుడిగా మళ్ళీ జీవీ ప్రకాష్ నే (G. V. Prakash Kumar) ఎంపిక చేసుకున్నారట.

గుణశేఖర్ సినిమాకి బిజినెస్ సమస్యలు.. ఏమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus