ప్రముఖ నటుడు విజయ్ ఆంటోనీ నకిలీ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చాడు. అయితే 2016 లో వచ్చిన బిచ్చగాడు సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. అప్పట్లో ఈ మూవీ ఎంత సన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు లో కూడా రికార్డ్ కలెక్షన్లు అందుకుంది. కాగా ఇప్పుడు బిచ్చగాడుకు కొనసాగింపుగా వచ్చిన ‘బిచ్చగాడు 2’ తో విజయ్ ఆంటోనీ మరో భారీ హిట్ అందుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల పరంగా ఆయన కెరీర్ హయ్యస్ట్ గ్రాస్ నమోదు చేసింది. అయితే ఊహించని రీతిలో తాజాగా వారి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విజయ్ ఆంటోనీ కుమార్తె పేరు మీరా. ప్రస్తుతం ఆమె వయసు 16 ఏళ్ళు.. కాగా చెన్నైలో గల ఓ ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్నారు. విజయ్ ఆంటోనీ కుటుంబం డిడికె రోడ్‌లో నివాసం ఉంటున్నారు. అయితే ఇంట్లో తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో మీరా ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం.
చెన్నైలోని తేనాంపేట పోలీసులు మీరా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిటీలోని ఓమంతురార్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడు హీరో విజయ్ ఆంటోనీ ఇంట వరుస విషాదాలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈఏడాది జనవరిలో బిచ్చగాడు 2′ షూటింగ్ సమయంలో తీవ్రంగా గాయపడగా.. దవడ, పళ్లు విరిగిపోయాయి. చావు అంచులదాకా వెళ్లొచ్చారు.
3నెలల తర్వాత కోలుకున్నారు. ఇప్పుడిప్పుడే ఆ షాక్ నుంచి బయటపడుతున్న (Vijay Antony) విజయ్ కుటుంబానికి ఆయన కూతురు ఆత్మహత్య కోలుకోలేని షాక్ అనే చెప్పొచ్చు. దీంతో ఫ్యాన్స్ స్టే స్ట్రాంగ్ విజయ్ సార్’ అని ట్వీట్స్ చేస్తున్నారు.
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!