Jr NTR: తారక్ మూవీకి అన్నీ ఫైనల్ అయ్యాయట.. వరుస అప్ డేట్స్ తో?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీకి సంబంధించి ఏడాదిన్నర క్రితం ప్రకటన వెలువడినా ఇప్పటికీ ఈ సినిమా షూట్ మొదలుకాకపోవడం అభిమానులను ఒకింత హర్ట్ చేసింది. ఒక దశలో ఈ సినిమా ఆగిపోయిందని కొరటాల శివ చెప్పిన కథ తారక్ కు నచ్చలేదని కామెంట్లు వినిపించాయి. తాజాగా ఎన్టీఆర్ వెకేషన్ కు వెళ్లిపోవడంతో ఈ ప్రాజెక్ట్ పై అనుమానాలు పెరిగాయి. అయితే వైరల్ అవుతున్న నెగిటివ్ వార్తలకు చెక్ పెడుతూ వరుస అప్ డేట్స్ తో తారక్ ఫ్యాన్స్ కు ఉత్సాహాన్ని కలిగించడానికి ఈ సినిమా నిర్మాతలు సిద్ధమయ్యారని సమాచారం.

తారక్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో నటిస్తుండగా ఎన్టీఆర్ తో తీసిన స్పెషల్ వీడియో ద్వారా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను మేకర్స్ వెల్లడించనున్నారని తెలుస్తోంది. ఈ స్పెషల్ వీడియోలో హీరోయిన్ కు సంబంధించిన వివరాలతో పాటు ఎన్టీఆర్30 రెగ్యులర్ షూట్ కు సంబంధించిన షాకింగ్ అప్ డేట్స్ కూడా వెల్లడించనున్నారని బోగట్టా. ఎన్టీఆర్30 గ్లింప్స్ లో వస్తున్నా అనే డైలాగ్ తో తారక్ ఈ ప్రాజెక్ట్ పై అంచనాలను పెంచేశారు.

అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండటంతో తమిళ ప్రేక్షకులు సైతంఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కొరటాల శివ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన లొకేషన్లను కూడా ఫైనల్ చేశారని సమాచారం. మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాతో తారక్ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

తారక్ పై స్పెషల్ గా షూట్ చేసిన వీడియో అతి త్వరలో రిలీజ్ కానుందని సమాచారం. 250 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus