Sreeleela: స్టార్ హీరోల చూపు మొత్తం ఆహీరోయిన్ వైపే చూస్తున్నారా..!

టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోయిన్ శ్రీలీల మేనియా ఏ రేంజ్ లో నడుస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ‘పెళ్లి సందడి’ చిత్రం తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ కుర్ర హీరోయిన్, ఆ తర్వాత ‘ధమాకా’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని, టాలీవుడ్ ని కబ్జా చేసేసింది. చిన్న హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకు ప్రతీ ఒక్కరు ఇప్పుడు శ్రీలీల డేట్స్ కోసం పడిగాపులు కాస్తున్నారు.

ఈమె దెబ్బకి పాపం పూజా హెగ్డే మరియు రష్మిక వంటి క్రేజీ స్టార్ హీరోయిన్స్ మాయం అయిపోయారు. ఇప్పుడు ఇంత క్రేజ్ తో కొనసాగుతున్న హీరోయిన్ శ్రీలీల పరిస్థితి కూడా రేపు ఇలాగే ఉంటుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆమె కెరీర్ కి డేంజర్ బెల్స్ ఇప్పటి నుండే మోగిపోతున్నాయి. ఆమెకి పోటీగా మృణాల్ ఠాకూర్ మరియు ప్రియాంక అరుల్ మోహన్ వచ్చేస్తున్నారు.

ముఖ్యంగా ప్రియాంక మోహన్ తెలుగు మరియు తమిళం భాషల్లో క్రేజీ ప్రాజెక్ట్స్ ని తన బుట్టలో వేసుకుంటుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఓజీ’ లో హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక మోహన్, ఈ సినిమా తర్వాత న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ చిత్రం లో కూడా నటిస్తుంది. ఇక నిన్ననే గ్రాండ్ గా ప్రారంభమైన రవితేజ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రాబోతున్న కొత్త సినిమాలో కూడా హీరోయిన్ గా ప్రియాంక మోహన్ సెలెక్ట్ అయ్యింది.

ఇలా తెలుగు లో ఆమె చేతిలో మూడు క్రేజీ సినిమాలు ఉన్నాయి. ఇక తమిళం లో ధనుష్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రం లోను, అలాగే ‘బ్రదర్’ అనే మరో తమిళ సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తుంది. రాబొయ్యే రోజుల్లో ఈమె (Sreeleela) శ్రీలీల స్థానం ని ఆక్రమించినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు విశ్లేషకులు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus