దర్శకుల ‘జాతకం’ తిరగబడుతుందా??

టాలీవుడ్ లో టాలెంట్ తో పాటు..కాస్త అదృష్టం కూడా తోడు కావాలి. ఎందుకంటే టాలెంట్ ఉన్న దర్శకులు, తొలి సినిమాతోనే టాలీవుడ్ రికార్డ్స్ ను బ్రేక్ చేసిన దర్శకులకు సైతం ఒక్కోసారి అవకాశాలు పెద్దగా రావు, ఇక తొలి సినిమా డిజాస్టర్ గా నిలిచి పెద్దగా టాలెంట్ లేకపోయినా కొందరు దర్శకులు తమ అదృష్టంతో ముందుకు పోతూ ఉంటారు. ఇదిలా ఉంటే ఒక్కోసారి అదృష్టం ఎంత కలసి వచ్చినా…ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అయితే వారి కధ ముగిసినట్లే..వివరాల్లోకి వెళితే….

టాలీవుడ్ లో ‘హ్యాపీ డేస్’ అంటూ కుర్రకారుల మనసు దోచిన దర్శకుడు శేఖర్ కమ్ముల. తొలి సినిమాతో టాలీవుడ్ లో తన టాలెంట్ ను నిరూపించుకున్న ఈ దర్శకుడు…ఆ తరువాత తాను తీసిన ‘లైఫ్ ఇస్ బ్యూటిఫుల్’ డమాల్ మానడంతో, అటుపై తన టాలెంట్ కు పదును పెట్టకుండా…మంచి ఆఫర్ వచ్చింది కదా అని, ‘కహానీ’ని ‘అనామిక’గా రీమేక్ చేసి దెబ్బయిపోయాడు.

అంతే అక్కడ మొదలయ్యింది శేఖర్ కమ్ముల కు బ్యాడ్ టైమ్. ఆ తరువాత ఏ ఒక్క సినిమా కూడా చెయ్యని ఈ దర్శకుడి అప్పట్లో…మహేష్ బాబుతో ఒక సినిమా ఉన్నట్లు, దానిపై కధ చర్చలు కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత ఆ వార్తలు మెల్లగా సైడ్ అయిపోయాయి. మరో పక్క ఎప్పట్నుంచో చర్చల్లో ఉన్న ‘హ్యాపీడేస్’ హిందీ రీమేక్ కూడా ముందుకు సాగట్లేదు. ఇక చేసేది ఏమీ లేని మన దర్శకుడు దాదాపుగా రెండు ఏళ్ల నుంచి ఖాళీగా ఉంటున్నట్లు సమాచారం. మరి ఇప్పటికైనా మించిపోయింది లేదు కాస్త పెన్నుకు పదును పెట్టి మంచి కధతో ట్రై చేస్తే టాప్ హీరోలు ఎప్పుడూ అవకాశం ఇవ్వడానికి రెడీ గా ఉంటారు. చూడాలి ఏం జరుగుతుందో.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus