బాహుబలి -2 ఫస్ట్ లుక్ రిలీజ్ తేదీ ఖరారు!

సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నబాహుబలి కంక్లూజన్ చిత్రం గురించి ఓ ఆసక్తికర సంగతి బయటికి వచ్చింది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి బాహుబలి బిగినింగ్ కంటే మించి ఉండాలని శ్రమిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ తేదీ ఖరారు అయింది. అక్టోబర్ 23 న విడుదల చేయాలనీ చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఆరోజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు. అందుకే ఆరోజు ఆయన అభిమానులకు కానుక గా తొలి పోస్టర్ ని అందించేందుకు సిద్ధమయ్యారు.

ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ పూర్తి చేసుకొని పాటల చిత్రీకరణలోకి ప్రవేశించింది. రామోజీ ఫిలిం సిటీ లో వేసిన స్పెషల్ సెట్ లో అత్యాధునిక కెమెరా పరికరాలను వాడి ప్రభాస్, అనుష్కలపై రొమాంటిక్ సాంగ్ ని అందంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ప్రొడక్షన్  నవంబర్ నాటికి పూర్తి అవుతుంది. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ కోసం 5 నెలలు కేటాయించారు. అత్యాధునిక హంగులను జోడించి ఈ మూవీని ఏప్రిల్ 28 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చెయ్యడానికి పక్క ప్లాన్ తో రాజమౌళి బృందం శ్రమిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus