ఎన్టీఆర్ బయో పిక్ లో తన గెటప్ ల గురించి చెప్పిన బాలయ్య

  • January 8, 2018 / 01:43 PM IST

మహానటుడు నందమూరి తారక రామారావు సినిమా కోసం నందమూరి అభిమానులతో పాటు తెలుగు వారందరూ ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలో వెండి తెర వెనుక జరిగిన సంఘటనలను వెండితెరపై చూడాలని కోరుకుంటున్నారు. అందుకోసం పనులు మొదలయ్యాయి. తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్ బయో పిక్ మూవీ గురించి బాలకృష్ణ ఆసక్తికర సంగతులు వెల్లడించారు. ఆయన కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటించిన “జై సింహా” చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా బాలయ్య మాట్లాడుతూ… “ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర కోసం 62 గెటప్‌ లు వేయనున్నాను.

ఎన్టీఆర్ జన్మించిన సమయం నుంచి మరణించే వరకు ఆయన జీవితంలో జరిగిన సంఘటనలన్నింటినీ ఈ బయోపిక్‌లో చూపించనున్నాం. మహానటుడు బాల్యం, యుక్త వయసు అలాగే వృద్ధాప్యం వరకు అన్ని వేషాలు వేయనున్నాను” అని ఆశ్చర్య పరిచారు. అంతేకాదు.. ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ పాత్రలో కూడా తానే నటిస్తానని వివరించారు. అంటే తన నిజ జీవిత రోల్ ని సైతం సొంతంగా వెండితెరపై పోషించనున్నారు. సినిమాలోని ప్రత్యేకతలు అన్ని ఇప్పుడే చెప్పేస్తే థ్రిల్ ఉండదన్నారు. ఇక జై సింహ విషయానికి వస్తే బాలయ్య లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నయనతార ఇందులో నటిస్తుండడంతో హిట్ గ్యారంటీ అని చిత్ర బృందం ధీమాగా ఉంది. సి. కళ్యాణ్ భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార తో పాటు నటాషా దోషి, హరి ప్రియలు ఆడి పాడనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus