Balakrishna: బాలయ్య జాబితాలో ఏకంగా నలుగురు దర్శకులు.. ఎవరికి ఛాన్స్ దక్కుతుందో?

  • May 18, 2023 / 01:15 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ఒకవైపు సినిమాలతో మరోవైపు అన్ స్టాపబుల్ షోతో సక్సెస్ సాధించడం గమనార్హం. బాలయ్య అనిల్ రావిపూడి సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో పాటు కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు. జూన్ నెల 10వ తేదీన బాలయ్య పుట్టినరోజు కాగా ఆరోజున బాలయ్య అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ లు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ నుంచి టైటిల్ తో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ కానుందని తెలుస్తోంది.

ఈ రెండు అప్ డేట్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని సమాచారం అందుతోంది. బాలయ్యతో సినిమా తీసే దర్శకుల జాబితాలో బోయపాటి శ్రీను, బాబీ, వెంకటేశ్ మహా, బలగం ఫేమ్ వేణు పేర్లు ప్రముఖంగా ఉన్నాయి. కనీసం రెండు ప్రాజెక్ట్ లకు సంబంధించి అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బాలయ్య ఏ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించినా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథలను ఎంచుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

బాలయ్య పారితోషికం అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. బాలయ్య మాస్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. బాలయ్య కాజల్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. అనిల్ రావిపూడి బాలయ్య స్టైల్ లోనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 21వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతోంది.

బాలయ్య స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో పని చేస్తుండటం ఆయన కెరీర్ కు కూడా ఒకింత ప్లస్ అవుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బాలయ్య వేగంగా సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్న బాలయ్య యాడ్స్ లో కూడా కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus