సింహా, లెజెండ్, అఖండ సినిమాలతో బాలకృష్ణ, బోయపాటి శ్రీను హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నారు. ఈ తరం డైరెక్టర్లలో బోయపాటి శ్రీను మాత్రమే బాలయ్యకు సూటయ్యే కథలను ఎంచుకుని ఆ కథలతో విజయాలను సొంతం చేసుకుంటున్నారు. అఖండ సినిమా వీక్ డేస్ లో కూడా భారీస్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ఏరియాలలో ఈ సినిమాకు టికెట్లు దొరకడం కష్టమవుతోంది. అఖండ మూవీలో అఘోరా పాత్రలో బాలయ్య బాగా నటించడంతో బాలయ్య ఫ్యాన్స్ అఖండ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుందని భావిస్తున్నారు.
అయితే అఖండ సీక్వెల్ గురించి బోయపాటి శ్రీను ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. అయితే అఖండ సీక్వెల్ కాకపోయినా బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కే అవకాశం అయితే ఉంటుందని సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ బోయపాటి శ్రీను అఖండ సీక్వెల్ ప్రతిపాదన తెస్తే బాలయ్య అంగీకరిస్తారో లేదో చూడాల్సి ఉంది.
గురువారం అఖండ మూవీ రిలీజ్ కావడంతో లాంగ్ వీకెండ్ ను ఈ సినిమా క్యాష్ చేసుకుంది. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో భవిష్యత్తులో తెరకెక్కే సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడే ఛాన్స్ అయితే ఉంది. బాలయ్య సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫుల్ రన్ లో అఖండ 80 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.