రికార్డులు తిరగరాస్తామని చెబుతున్న బాలయ్య.. ఆ రేంజ్ లో ఉంటుందంటూ?

నందమూరి నటసింహం బాలకృష్ణ  (Balakrishna)  బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. బాలయ్య నటించిన లెజెండ్ విడుదలై పది సంవత్సరాలు కాగా ఈ నెల 30వ తేదీన ఈ సినిమా రీరిలీజ్ అవుతోంది. లెజెండ్ (Legend) రీరిలీజ్ సందర్భంగా బాలయ్య ఈ సినిమాకు సంబంధించిన ఏర్పాటు చేసిన ఈవెంట్ లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రికార్డులు నాకు కొత్త కాదని రికార్డులు సృష్టించాలన్నా రికార్డులు తిరగరాయాలన్నా నేనేనని బాలయ్య అన్నారు.

కొన్ని సినిమాలు చరిత్రలో నిలిచిపోతుంటాయని సింహా (Simha) , లెజెండ్, అఖండ (Akhanda) అలాంటివేనని ఆయన కామెంట్లు చేశారు. లెజెండ్ మూవీ 1116 రోజులు నాలుగు ఆటలు ఆడి సౌత్ సినీ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసిందని బాలయ్య కామెంట్లు చేశారు. నా గత రెండు సినిమాలు నాలో మరింత కసిని పెంచాయని ఇలాంటి మంచి సినిమాలు ఇస్తే మరిన్ని చేయండని ప్రేక్షకులు వెన్నుతట్టి ప్రోత్సహిస్తారని ఆయన పేర్కొన్నారు.

ఈ వేడుకకు హీరోయిన్ సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) పసుపు దుస్తుల్లో వచ్చారని పసుపు అభివృద్ధికి నిదర్శనమని బాలయ్య అన్నారు. నేను, బోయపాటి శ్రీను (Boyapati Srinu) మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తుంటామని ఆయన కామెంట్లు చేశారు. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ భవిష్యత్తు సినిమాలు భారీ స్థాయిలో ఉంటాయంటూ బాలయ్య కామెంట్ల ద్వారా అర్థమవుతోంది. ఈ కాంబినేషన్ లో త్వరలో అఖండ2 సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ సినిమా ఏ బ్యానర్ లో తెరకెక్కుతుందో తెలియాల్సి ఉంది. బాలయ్య బోయపాటి శ్రీనును అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. ఈ సినిమా గురించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. అఖండ2 సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా బాలయ్య కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus