Balakrishna, Vasishta: బింబిసార డైరెక్టర్ బాలయ్యతో సినిమా తెరకెక్కించనున్నారా?

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. అఖండ సినిమా సక్సెస్ తో బాలయ్యకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఈతరం యువతలో బాలయ్యను చాలామంది అభిమానిస్తున్నారు. క్రాక్ సినిమాతో సక్సెస్ సాధించిన గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలకృష్ణ జై బాలయ్య అనే సినిమాలో నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది.

బాలయ్య అనిల్ రావిపూడి కాంబో సినిమాకు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. వచ్చే ఏడాది కొన్ని నెలల గ్యాప్ లోనే ఈ రెండు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. అయితే బింబిసార డైరెక్టర్ వశిష్టతో కూడా సినిమా చేస్తానని తాజాగా బాలకృష్ణ వెల్లడించారు. బింబిసార సినిమా చూసిన తర్వాత బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఈ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడుతుందేమో చూడాల్సి ఉంది.

దర్శకుడు వశిష్టకు వరుసగా నందమూరి హీరోలతో సినిమాలను తెరకెక్కించే ఆఫర్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బింబిసార2 సినిమా బింబిసార1 ను మించి సక్సెస్ సాధిస్తే వశిష్టకు స్టార్ హీరోల సినిమాలకు వరుసగా దర్శకత్వం వహించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. బింబిసార సినిమా 35 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా ఫుల్ రన్ లో ఈ సినిమా బడ్జెట్ కు రెట్టింపు స్థాయిలో లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

వశిష్ట తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవడం గమనార్హం. బింబిసార సక్సెస్ తో వశిష్ట రెమ్యునరేషన్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. వశిష్ట తర్వాత సినిమాలతో స్టార్ డైరెక్టర్ స్టేటస్ ను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus