బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు

  • August 23, 2017 / 01:41 PM IST

మన దేశంలోని ఏ చిత్ర పరిశ్రమలో ఏ హీరో చేయని విధంగా మహా నటుడు నందమూరి తారకరామారావు అత్యధిక చిత్రాల్లో ద్వి పాత్రాభినయం చేశారు. 35 సినిమాల్లో డబల్ రోల్ పోషించి రికార్డు సృష్టించారు. ఆయన తర్వాత తెలుగులో అత్యధికంగా (16 చిత్రాల్లో) ద్వి పాత్రాభినయం చేసిన ఘనత బాలయ్యకే సొంతం. వీటిలో ఒక చిత్రంలో త్రి పాత్రాభినయం చేసారు. ఆ సినిమాలేంటో చూద్దాం…

01 . అపూర్వ సహోదరులు (1986 )కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన అపూర్వ సహోదరులు చిత్రంలో బాలకృష్ణ .. రాము, అరుణ్ కుమార్ పాత్రల్లో అదరగొట్టారు.

02 . రాముడు – భీముడు (1988 )ఎన్టీఆర్ అలనాడు రాముడు – భీముడులో డ్యూయల్ రోల్ చేసి హిట్ కొట్టారు. అలాగే అయన తనయుడు బాలకృష్ణ రాముడు, భీముడిగా విజయం అందుకున్నారు.

03 . ఆదిత్య 369 (1991 )తొలి తెలుగు సైన్స్ ఫిక్షన్ మూవీ ఆదిత్య 369 లో కృష్ణ కుమార్, శ్రీకృష్ణ దేవరాయలుగా మెప్పించారు.

04 . బ్రహ్మర్షి విశ్వ మిత్ర (1991 )బ్రహ్మర్షి విశ్వ మిత్ర లో ఎన్టీఆర్ తో పాటు బాలకృష్ణ రెండు పాత్రల్లో మెప్పించారు. సత్య హరిచంద్ర & దుశ్యంత పాత్రలకు ప్రాణం పోశారు.

05 . మాతో పెట్టుకోకు (1995 )ఎస్ గోపాల్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాతో పెట్టుకోకు మూవీలో బాలయ్య SP అర్జున్, కిష్టయ్య క్యారెక్టర్లో మాస్ ని మెప్పించారు.

06 . శ్రీ కృష్ణార్జున విజయం (1996 )పౌరాణిక పాత్రలు పోషించడంలో ఎన్టీఆర్ దిట్ట. ఆయన నట వారసుడైన బాలకృష్ణ శ్రీ కృష్ణార్జున విజయం లో కృష్ణుడిగా, అర్జునిడా చక్కగా నటించారు.

07 . పెద్దన్నయ్య (1997 )వయసులో ఎక్కువ తేడా ఉన్న అన్నదమ్ములుగా బాలకృష్ణ నటించిన సినిమా పెద్దన్నయ్య. ఇందులో రామ కృష్ణ ప్రసాద్, భవాని ప్రసాద్ లుగా అలరించారు.

08 . సుల్తాన్ (1999 ) సుల్తాన్ సినిమాలో సుల్తాన్, పృథ్వీ పాత్రల్లో బాలయ్య నటనలో వేరియేషన్ చూపించారు. ప్రేక్షకుల నుంచి అభినందనలు అందుకున్నారు.

09 . చెన్న కేశవ రెడ్డి (2002 )సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ భరత్ గాను, పగతో రగిలిపోయే చెన్న కేశవ రెడ్డి గాను ఆకట్టుకున్నారు.

10 . అల్లరి పిడుగు (2005 ) జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన అల్లరి పిడుగులో ACP రంజిత్ కుమార్, గిరి పాత్రల్లో ఫుల్ జోష్ గా బాలకృష్ణ నటించారు.

11 . ఒక్క మగాడు (2008 ) ఎన్నో అంచనాలతో రిలీజ్ అయినా సినిమా ఒక్క మగాడు. ఇందులో రఘుపతి రాఘవ రాజారామ్,
వీర వెంకట సత్యనారాయణ స్వామి పాత్రలు వైవిధ్యంగా ఉంటాయి. అయినా ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు.

12 . పాండు రంగడు (2008 ) దేవుడు, భక్తుడిగా బాలయ్య నటించిన సినిమా పాండు రంగడు. దర్శకేంద్రుడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కృష్ణ, పుండరీక రంగనాధుడు గా పాత్రల్లో నటించడం ఆయనకే సాధ్యం.

13 . సింహ (2010 )బాలకృష్ణకు పూర్వవైభవం తీసుకొచ్చిన మూవీ సింహ. ఇందులో తండ్రి కొడుకులుగా బాలయ్య నటన అదరహో అనిపిస్తుంది.

14 . పరమ వీర చక్ర (2011 ) దర్శకరత్న దాసరి నారాయణ రావు దర్శకత్వంలో బాలయ్య చేసిన పరమ వీర చక్రలో మేజర్ జయసింహ, చక్రధర్ పాత్రలు అభిమానులకు బాగా నచ్చాయి.

15 . అధినాయకుడు (2012 )అధినాయకుడు చిత్రంలో హరీష్ చంద్ర ప్రసాద్, రామ కృష్ణ ప్రసాద్, బాబీ పాత్రలతో నటసింహ దుమ్ము దులిపారు.

16 . లెజెండ్ (2014 ) బాలకృష్ణ చిత్రాల్లో లెజెండ్ స్పెషల్. ఇందులో ఆయన పోషించిన జయదేవ్, కృష్ణ రోల్స్ కూడా ఫ్యాన్స్ కి మరింత స్పెషల్. రెండూ క్యారెక్టర్స్ థియేటర్లో విజిల్స్ వేయించాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus