Balakrishna: బాలయ్య మూవీ విషయంలో బోయపాటి శ్రీను అలా చేస్తారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. వేర్వేరు కారణాల వల్ల బాలయ్య బోయపాటి కాంబో మూవీ ఆలస్యమైందనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా బాలయ్య హిట్ సినిమాలలో ఒక సినిమాకు సీక్వెల్ అని ప్రచారం జరుగుతుండగా అఖండ2 సినిమాను తెరకెక్కించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అదే సమయంలో ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు విడుదలైనా పరవాలేదని ఈ సినిమా సక్సెస్ సాధిస్తే చాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అఖండ మూవీ హిందీలో విడుదలైనా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను అయితే సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. బాలయ్యకు పాన్ ఇండియా హిట్ ను బోయపాటి శ్రీను ఇస్తే మాత్రం తమ సంతోషానికి అవధులు ఉండవని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాలయ్యతో బోయపాటి శ్రీను భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించాలని అభిమానులు భావిస్తున్నారు.

బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య రెమ్యునరేషన్ 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా బోయపాటి శ్రీను రెమ్యునరేషన్ 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. బాలయ్య సినిమాలను ఇతర భాషల్లో కూడా తెలుగులో రిలీజ్ చేసిన సమయంలోనే విడుదల చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

2024 సంవత్సరం మే నెల తర్వాత (Balakrishna) బాలయ్య బోయపాటి శ్రీను కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. బాలయ్య బోయపాటి శ్రీను కాంబో మూవీ మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లా ఉండనుందని సమాచారం అందుతోంది. బాలయ్య బోయపాటి శ్రీను కాంబో మూవీ హక్కులను సొంతం చేసుకోవాలని చాలామంది డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus