Mokshagna: మోక్షజ్ఞ విషయంలో ఫీలవుతున్న బాలయ్య ఫ్యాన్స్.. కానీ?

  • June 9, 2023 / 06:09 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ఒకవైపు అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తూనే మరోవైపు బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలయ్య బాబీ కాంబో మూవీ వచ్చే ఏడాది శివరాత్రి కానుకగా రిలీజ్ కానుందని తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. అయితే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ విషయంలో కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఈ ఏడాదే మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని బాలయ్య గతంలో గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఇతర హీరోల వారసులు ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకున్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ మాత్రం అంతకంతకూ ఆలస్యమవుతుండటం గమనార్హం. మోక్షజ్ఞ ఎంట్రీ వాయిదా వెనుక అసలు కారణాలు వెలుగులోకి రాలేదు. మోక్షజ్ఞ శిక్షణ తీసుకుంటున్నాడని ఇప్పటికే పలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

మోక్షజ్ఞ (Mokshagna) ఇంటర్వ్యూలకు దూరంగా ఉండటంతో కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోక్షజ్ఞతో సినిమాను నిర్మించడానికి టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. మోక్షజ్ఞ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. ఆదిత్య 999 మ్యాక్స్ సినిమాతో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉండనుంది. మోక్షజ్ఞ ఎప్పుడు ఎంట్రీ ఇచ్చినా కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మోక్షజ్ఞ తొలి సినిమా బాలయ్య, మోక్షజ్ఞ కాంబినేషన్ లో తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. మోక్షజ్ఞ మాస్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారో లేక క్లాస్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తారో చూడాల్సి ఉంది. కెరీర్ విషయంలో మోక్షజ్ఞ ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా వరుసగా విజయాలు దక్కేలా మోక్షజ్ఞ కెరీర్ ను ప్లాన్ చేసుకోవాల్సి ఉంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus