ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టయి దాదాపు 20 రోజులు అయినప్పటికీ ఈ అరెస్టు గురించి ఎన్టీఆర్ మౌనంగానే ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల విమర్శలు వచ్చిన ఎన్టీఆర్ ఎక్కడ కూడా ఈ విషయం గురించి స్పందించిన దాఖలాలు లేవు. చంద్రబాబు అరెస్టు విషయంలో ఎన్టీఆర్ మౌనంగా ఉండడంతో కొందరు ఎన్టీఆర్ అభిమానులు అలాగే తెలుగుదేశం నేతలు ఎన్టీఆర్ వ్యవహార శైలి పై విమర్శలు చేశారు.
ఇకపోతే తాజాగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయం గురించి బాలకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మౌనంగా ఉండడం గురించి కూడా విలేకరులు బాలయ్యను ప్రశ్నించడంతో మొదటిసారి ఎన్టీఆర్ గురించి బాలకృష్ణ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు సినీ పరిశ్రమకు కూడా ఎంతో మంచి చేశారు.
ఇలా ఈయన అరెస్ట్ అవడంతో కొంతమంది సినీ ప్రముఖులు మాత్రమే ఈ విషయంపై మాట్లాడుతూ స్పందించారు. కానీ అనుకున్న స్థాయిలో చిత్ర పరిశ్రమ నుంచి కూడా ఏమాత్రం మద్దతు లభించలేదని చెప్పాలి. అయితే చంద్రబాబు నాయుడుని బయటకు తీసుకురావడం కోసం నారా నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి బాలయ్య చిత్ర పరిశ్రమ నుంచి మద్దతు రాకపోవడం గురించి స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరెస్టుపై సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు స్పందించకపోయిన నేను ఏమాత్రం పట్టించుకోనని ఈయన తెలిపారు. (Jr NTR) జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించడం లేదు ఈ విషయం మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించడంతో బాలయ్య సమాధానం చెబుతూ.. ఐ డోంట్ కేర్ బ్రో అంటూ సినిమా స్టైల్ లో సమాధానం చెప్పారు దీంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.
స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!
చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !