Balakrishna, Pawan Kalyan: ఆ సినిమాలో దేవుడి పాత్రలో బాలయ్య.. కానీ?

  • March 6, 2022 / 06:16 PM IST

స్టార్ హీరో బాలకృష్ణ తన సినీ కెరీర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించారనే సంగతి తెలిసిందే. ఈతరం హీరోలలో పౌరాణిక పాత్రలలో కూడా నటించి మెప్పించిన హీరోలలో బాలకృష్ణ ఒకరు. అయితే బాలయ్య ఒక సినిమాలో దేవుడి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. బాలయ్య దేవుడి పాత్రలో కనిపించడంలో ఆశ్చర్యం లేకపోయినా మఫ్టీలో ఉన్న దేవుడిగా బాలయ్య కనిపిస్తారని బోగట్టా. గోపాల గోపాల సినిమాలో పవన్ నటించిన పాత్ర తరహాలో బాలయ్య నటించే పాత్ర ఉండనుందని సమాచారం అందుతోంది.

పీపుల్స్ మీడియా బ్యానర్ లో తెరకెక్కనున్న రీమేక్ సినిమాలో హీరో రోల్ కోసం మేకర్స్ బాలయ్యను సంప్రదించారని బోగట్టా. అయితే బాలయ్య నుంచి ఈ పాత్రకు ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని సమాచారం. బాలయ్య ఓకే చెబితే మాత్రం బాలయ్యను ప్రేక్షకులు మఫ్టీలో ఉన్న దేవుడిగా చూడవచ్చు. ఇప్పటివరకు బాలయ్య ఈ తరహా పాత్రలో నటించకపోవడంతో బాలయ్య ఈ పాత్రలో నటిస్తే బాగుంటుందని అభిమానులు సైతం భావిస్తున్నారు. బాలయ్య నో చెబితే ఈ పాత్రలో మరో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నటించే అవకాశాలు ఉన్నాయని బోగట్టా.

బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఈ ఏడాదే ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. త్వరలో బాలయ్య అనిల్ కాంబో మూవీ కూడా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలకు బాలయ్య ఓకే చెబుతూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. అఖండ సక్సెస్ తో జోరుమీదున్న బాలయ్య కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

బాలయ్య తర్వాత సినిమాలతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు వెలువడాల్సి ఉంది. ఆరు పదుల వయస్సులో కూడా బాలయ్య యాక్టివ్ గా ఉంటూ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus