Balakrishna: కొడుకు కోసం ఆ పని చేస్తున్న బాలయ్య.. గ్రేట్ అంటూ?

  • May 30, 2023 / 03:13 PM IST

స్టార్ హీరో బాలకృష్ణ సక్సెస్ రేట్ సినిమా సినిమాకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలలో నటిస్తున్న బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటిస్తున్న సినిమాను ఈ ఏడాది దసరా కానుకగా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. అయితే మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ త్వరగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని నందమూరి అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. పుల్లేటికుర్రు చౌడేశ్వరి ఆలయంలో బాలయ్య తాజాగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మోక్షజ్ఞ కోసమే బాలయ్య ఈ పూజలు చేశారని బోగట్టా. బాలయ్యకు దైవభక్తి ఎక్కువనే సంగతి తెలిసిందే. బాలయ్య మూహూర్తాలను ఎక్కువగా నమ్ముతారనే సంగతి తెలిసిందే. బాలయ్య పుట్టినరోజుకు సరిగ్గా రెండు వారాల సమయం ఉండగా బాలయ్య బర్త్ డే వేడుకలు గ్రాండ్ గా జరగనున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

బాలయ్య పుట్టినరోజు సందర్భంగా నరసింహ నాయుడు, భైరవద్వీపం సినిమాలు రీ రిలీజ్ కానున్నాయని సమాచారం అందుతోంది. మోక్షజ్ఞ తొలి సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ రావాల్సి ఉంది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. మోక్షజ్ఞ అద్భుతంగా డ్యాన్స్ చేస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. బాలయ్య పారితోషికం ప్రస్తుతం 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.

బాలయ్య (Balakrishna) బోయపాటి శ్రీను కాంబో మూవీ లెజెండ్ సినిమాకు సీక్వెల్ అని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో నెక్స్ట్ లెవెల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లకు సంబంధించి అధికారిక ప్రకటనలు రావాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే. బాలయ్య, మోక్షజ్ఞ కాంబినేషన్ లో సినిమాలు వస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. మోక్షజ్ఞకు సోషల్ మీడియాలో క్రేజ్ పెరుగుతోంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus