Balakrishna: శభాష్ బాలయ్య నువ్వు అందరివాడివి..ఆ విషయంలో నీకు సాటిలేరు

టాలీవుడ్‌లో ప్రస్తుతం హీరోల మధ్య చాలా సాన్నిహిత్యం నెలకొంది. హీరోలంతా తమ మధ్య విభేదాలు ఏవీ లేవని పలు సందర్భాల్లో చెబుతున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం గొడవలు పడుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో నందమూరి-మెగా ఫ్యాన్స్ మధ్య వైరం ఉంది. అయితే ఆహా యాప్‌లో అన్‌స్టాపబుల్ షో తర్వాత బాలయ్య ప్రస్తుతం అందరి వాడుగా మారిపోయాడు. ఇక ఇటీవల కాలంలో మెగా హీరోలతో ఆయన బాగా కలిసి పోయాడు. ఎంతలా అంటే బ్రో బ్రో అనేంతగా దగ్గర అయ్యాడు.

ఇంతకు ముందులా కాకుండా కేవలం తమ మధ్య మిత్రత్వమే ఉందని (Balakrishna) బాలయ్య నిరూపించాడు. మెగా హీరోలతో చాలా సన్నిహితంగా కనిపిస్తున్నాడు. భీమ్లా నాయక్ సినిమాను తాను చేయాల్సి ఉండగా, తన కంటే ఈ కథ పవన్ కళ్యాణ్‌కు బాగా సరిపోతుందని బాలయ్య సూచించాడు. అది వర్కవుట్ అయింది. ఇదే కోవలో పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్నారు. దీనికి బ్రో.. ఐ డోంట్ కేర్ అనే టైటిల్ అనుకున్నారు.

ఆ టైటిల్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే ఇటీవల సముద్ర ఖని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమా మొదలు పెట్టారు. దీనిలో హీరో పవన్ కళ్యాణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ బ్రో అని ప్రకటించారు. దీంతో బాలయ్య తన సినిమాకు అనుకున్న టైటిల్‌ను మార్చుకున్నారు. ఆ టైటిల్ పవన్‌కే ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. మరో వైపు తన సినిమాకు మోనార్క్ అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఓ సినిమాలో ప్రకాష్ రాజ్ తాను మోనార్క్ అని, తననెవరూ మోసం చేయలేరని అంటాడు. అది బాగా పాపులర్ అయిన డైలాగ్. దీనినే తమ సినిమాకు టైటిల్‌గా బాలయ్య అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా టైటిల్ విషయంలో బాలయ్య తీసుకున్న నిర్ణయానికి సినీ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. శభాష్ బాలయ్య నువ్వు అందరివాడివి..ఆ విషయంలో నీకు సాటిలేరని మరికొందరు అంటున్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus