Balakrishna: బాబీ మూవీలో బాలయ్య లుక్ ఇదే.. అదుర్స్ అనేలా ఉన్నాడంటూ?

స్టార్ హీరో బాలకృష్ణ సినిమా సినిమాకు లుక్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న సంగతి తెలిసిందే. బాలయ్య లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. బాలయ్య యంగ్ లుక్ అదుర్స్ అనేలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సినిమాలో బాలయ్య లుక్ అదుర్స్ అనే ఉంటే సినిమా హిట్ అని బాలయ్య బాబీ సినిమా కూడా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఈ ఏడాది మే నెలలో ఈ సినిమా రిలీజ్ కానుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా గురించి మేకర్స్ నుంచి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. గుంటూరు కారం మూవీ విడుదలైన తర్వాత సితార నిర్మాతలు బాలయ్య బాబీ సినిమా ప్రమోషన్స్ పై దృష్టి పెట్టనున్నారని సమాచారం అందుతోంది. ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

బాలయ్య లేటెస్ట్ లుక్ ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా ఉండటం గమనార్హం. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా బాబీ డియోల్ నటిస్తుండగా ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల గురించి క్లారిటీ రావాల్సి ఉంది. నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. బాలయ్య బాబీ కాంబో మూవీ పాన్ ఇండియా మూవీగా విడుదలవుతుందో లేదో స్పష్టత రావాల్సి ఉంది.

బాలయ్య బాబీ కాంబో మూవీని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తే ఈ సినిమా అంచనాలను మించి బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సోలో రిలీజ్ డేట్ ను ఎంచుకుని ఈ సినిమాను రిలీజ్ చేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది రెండు విజయాలను సొంతం చేసుకున్న బాలయ్య ఈ ఏడాది కూడా మరో సక్సెస్ ను అందుకుంటారేమో చూడాలి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus