నాగార్జున సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న బాలకృష్ణ.. ఏదంటే?

స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చిన్న కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. తక్కువ సమయంలోనే ఎన్టీఆర్ లెజసిని మ్యాచ్ చేస్తూ స్టార్ డమ్ తెచ్చుకున్నారు. కెరీర్ ప్రారంభంలోనే ‘మంగమ్మగారి మనవడు’ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నారు బాలకృష్ణ. ఇక మరోవైపు అక్కినేని నాగేశ్వరరావు చిన్న కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు కింగ్ నాగార్జున.

Janaki Ramudu

మొదట్లో కొంచెం తడబడినా.. ‘మజ్ను’ నుండి గాడిలో పడ్డారు. అటు తర్వాత ‘గీతాంజలి’ వంటి సినిమాలతో తన మార్క్ ను చాటుకున్నారు. లవ్ స్టోరీస్, ఫ్యామిలీ సినిమాలు ఎంతలా కలిసొచ్చినా.. మాస్ సినిమాలను కూడా అవాయిడ్ చేయలేదు నాగార్జున. అలా కన్సిస్టెంట్ గా హిట్లు కొడుతూ స్టార్ గా ఎదిగారు.

ఇదిలా ఉంటే.. కెరీర్ ప్రారంభంలో బాలకృష్ణ చేయాల్సిన ఓ సూపర్ హిట్ మూవీ నాగార్జునకి వెళ్ళింది. అది పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.తర్వాత విషయం తెలుసుకున్న నందమూరి అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. ఆ సినిమా మరేదో కాదు ‘జానకి రాముడు’.నాగార్జున, విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 1988 ఆగస్టు 19న విడుదలయ్యింది.

మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా ఘన విజయం సాధించింది. కీరవాణి తండ్రి శివశక్తి దత్తా, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథని డిజైన్ చేశారు. అయితే ఇదే కథ బాలకృష్ణ, కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు సెట్ కాలేదు. బాలకృష్ణ- కోడి రామకృష్ణ కాంబోలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. ‘జానకి రాముడు’ కనుక చేసుంటే ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసి ఉండేదేమో.

‘ధూమ్ 4’ లో రాంచరణ్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus