Buddy: బడ్డీ సినిమాకు ఆ సీన్స్ హైలెట్ కానున్నాయా.. ఏం జరిగిందంటే?

అల్లు శిరీష్ (Allu Sirish) హీరోగా తెరకెక్కిన బడ్డీ (Buddy) మూవీపై ఒకింత భారీ స్థాయిలోనే అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. మొదట జులై నెల 26వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావించినా ఆ తర్వాత ఈ సినిమాను ఆగష్టు నెల 2వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. అల్లు శిరీష్ ఈ సినిమాతో కచ్చితంగా హిట్ సాధిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా టెడ్డీ మూవీ రీమేక్ అని ప్రచారం జరిగినా ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ వచ్చేసింది.

అయితే బడ్డీ సినిమాలో బాలయ్య రిఫరెన్స్ ఉండనుందని సమాచారం అందుతోంది. ఫిక్షనల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కగా సామ్ ఆంటోన్ ఈ సినిమాకు డైరెక్టర్ గా పని చేశారు. ఈ సినిమాలో అల్లు శిరీష్ ఫ్లైట్ కెప్టెన్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే బడ్డీ సినిమాకు సంబంధించి వచ్చిన అప్ డేట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం కొసమెరుపు. కథ, కథనం అద్భుతంగా ఉంటే ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుంది.

సినిమాలో జై బాలయ్య (Balakrishna) స్లోగన్ వినిపిస్తుందని ఒక యాక్షన్ సీన్ సమయంలో ఈ స్లోగన్ వినిపించడంతో పాటు భగవంత్ కేసరి (Bhagavanth Kesari) థీమ్ మ్యూజిక్ కూడా వినిపించనుందని భోగట్టా. హిప్ హాప్ తమిళ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. బడ్డీ సినిమా కాన్సెప్ట్ కూడా అద్భుతంగా ఉండనుందని భోగట్టా. ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం అందుతోంది.

బడ్డీ సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం స్పెషల్ గా ఉండనున్నాయని తెలుస్తోంది. చాలా కాలం గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ నటించి రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో అల్లు ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బడ్డీ సినిమాలో గ్రాఫిక్స్ కు కూడా ప్రాధాన్యత ఎక్కువగానే ఉండనుందని సమాచారం అందుతోంది. బడ్డీ సినిమా బుకింగ్స్ త్వరలో మొదలుకానున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus