Balakrishna, Anil Ravipudi : స్క్రిప్ట్ విషయంలో బాలయ్య సలహా ఇచ్చారా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన అనిల్ రావిపూడి వరుసగా ఆరు విజయాలతో డబుల్ హ్యాట్రిక్ సాధించిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి తర్వాత సినిమా బాలకృష్ణ హీరోగా తెరకెక్కనుంది. బాలయ్య శైలిలోనే ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. బాలయ్య ఫ్యాన్స్ మెచ్చే యాక్షన్ సన్నివేశాలతో పాటు అనిల్ రావిపూడి ఫ్యాన్స్ కు నచ్చే కామెడీ సన్నివేశాలు కూడా ఈ సినిమాలో ఉంటాయని సమాచారం. అయితే తాజాగా బాలయ్య ఎఫ్3 సినిమాను థియేటర్ లో వీక్షించిన సంగతి తెలిసిందే.

అయితే సినిమా చూసిన తర్వాత బాలయ్య తను హీరోగా తెరకెక్కుతున్న మూవీలో కామెడీ సీన్లను మరింత పెంచాలని షరతు విధించారని అనిల్ రావిపూడి ఆ షరతుకు ఓకే చెప్పారని సమాచారం. స్క్రిప్ట్ విషయంలో బాలయ్య ఇచ్చిన సూచనలు సినిమాకు ఊహించని స్థాయిలో ప్లస్ అయ్యేలా ఉన్నాయని సమాచారం అందుతోంది. బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. సాహో గారపాటి నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

సెప్టెంబర్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. బాలయ్యకు జోడీగా ఈ సినిమాలో ప్రియమణి నటిస్తున్నారని బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాతో కచ్చితంగా మరో సక్సెస్ సాధిస్తానని అనిల్ రావిపూడి భావిస్తున్నారు. మరోవైపు ఎఫ్3 సినిమా హిట్టైనా ఈ సినిమా మరీ ఎఫ్2 స్థాయిలో అయితే లేదని కామెంట్లు వినిపించాయి. అనిల్ రావిపూడి ఎఫ్4 సినిమాకు దూరంగా ఉంటే బెటర్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య అనిల్ రావిపూడి సినిమా తర్వాత నటించే సినిమాలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు విడుదలయ్యేలా బాలయ్య కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. బాలయ్య ఈ సినిమాకు కూడా 12 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుంటారని సమాచారం అందుతోంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus