Balakrishna, Taraka Ratna: తారకరత్న కుటుంబానికి అండగా నిలిచిన బాలయ్య!

నందమూరి కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విధంగా నందమూరి ఫ్యామిలీలో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం రాజకీయాలలోకి వచ్చే రాజకీయాలలో కూడా రాణించాలనుకున్న తారకరత్న పాదయాత్రలో భాగంగా గుండెపోటుకు గురై 23 రోజులపాటు వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటూ ఫిబ్రవరి 18వ తేదీ మరణించిన సంగతి మనకు తెలిసిందే.ఇలా తారకరత్న మరణంతో ఒక్కసారిగా నందమూరి కుటుంబంలోనూ సినీ ఇండస్ట్రీలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇక తారకరత్న బాలకృష్ణకు వ్యక్తిగతంగా ఎంతో మంచి అనుబంధం ఉంది. తారకరత్న బాలయ్య అంటే ఎంతో గౌరవించడమే కాకుండా ఆయన అంటే ఎంతో అభిమానం ఉండేది ఇక బాలకృష్ణ కూడా తారకరత్న అంటే ఎంతో ప్రేమ అభిమానాలను చూపించేవారు.ఇలా పాదయాత్రలో తారకరత్న స్పృహ తప్పి పడిపోవడంతో బాలకృష్ణ నిత్యం తన వెంటే ఉంటూ తన క్షేమం కోసం ఎంతో పరితపించారు.బెంగళూరులోనే ఉంటూ తారకరత్న ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ఆయన క్షేమంగా బయటపడాలని కోరుకున్నారు.

ఇలా తారకరత్న క్షేమంగా బయటకు వస్తారని అందరూ భావించినప్పటికీ ఆయన మాత్రం ప్రాణాలతో పోరాడుతూ చివరికి విధి చేతిలో ఓడిపోయారు. ఇలా తారకరత్న లేరు అనే వార్త అందరిని ఎంతగానో కృంగదీస్తుంది. తారకరత్న ఫ్యామిలీ విషయానికి వస్తే తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి దంపతులకు ముగ్గురు పిల్లలు కలరు అనే విషయం మనకు తెలిసిందే.

తారకరత్న మరణించడంతో బాలకృష్ణ ఆ పిల్లల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పిల్లల పూర్తి బాధ్యత తనదేనని,వారికి ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత తనదేనంటూ బాలకృష్ణ అలేఖ్య రెడ్డికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.అలాగే తన కుటుంబానికి అండగా బాలకృష్ణ ఉంటానంటూ ఆయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ కావడంతో బాలయ్య అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus