టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా రెమ్యునరేషన్ విషయంలో బాలయ్య వ్యవహరిస్తున్న తీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. స్టార్ హీరో బాలయ్య సినిమాల థియేట్రికల్ హక్కులు 80 కోట్ల రూపాయలకు అటూఇటుగా అమ్ముడవుతున్నాయి. నాన్ థియేట్రికల్ హక్కులు 60 నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్ లో అమ్ముడవుతూ ఉండటం గమనార్హం. అయితే బాలయ్య ఇప్పటివరకు తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ 18 కోట్ల రూపాయలు మాత్రమేనని తెలుస్తోంది.
సినిమాల మార్కెట్ పెరిగిన స్థాయిలో బడ్జెట్ పెరగకుండా బాలయ్య జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల బాలయ్య సినిమాలు హిట్ టాక్ వస్తే భారీ స్థాయిలో లాభాలు వస్తుండగా యావరేజ్ టాక్ వచ్చినా నిర్మాతలకు నష్టాలు అయితే రావడం లేదు. ఈ విషయంలో బాలయ్యకు బాలయ్యే సాటి అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాలో నటిస్తుండగా అతి త్వరలో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుకానున్నాయి.
థమన్ బాలయ్య (Balakrishna) కోసం స్పెషల్ సాంగ్స్ ను సిద్ధం చేశారని ఆ సాంగ్స్ సినిమాలపై అంచనాలను రెట్టింపు చేసే విధంగా ఉన్నాయని భగవంత్ కేసరి సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య ఒక సినిమా షూటింగ్ పూర్తికాక ముందే మరో సినిమాను ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. బాలయ్య బాబీ కాంబో మూవీలో నటించే హీరోయిన్లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.
బాలయ్య బాబీ కాంబో మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ ను కోరుకుంటున్నారు. బాలయ్య త్వరలో మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. స్టార్ హీరో బాలకృష్ణ వయస్సుకు అనుగుణంగా పాత్రలను ఎంచుకుంటున్నారు. ఇతర భాషల్లో సైతం బాలయ్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం గమనార్హం.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!