ముందుగానే…దూసుకొస్తున్న బాలయ్య!!!

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రతిష్టాత్మక 100వ చిత్రంపై రోజుకో వార్త టాలీవుడ్ లో సెన్సేషనల్ గా మారుతుంది. అయితే అదే క్రమంలో బాలయ్య వందో సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. ఒక పక్క సినిమా షూటింగ్ వేగంగా జరుగుతూ….దాదాపుగా చివరి దశకు చేరుకోగా..మరో పక్క గ్రాఫిక్స్ వర్క్ కూడా మంచి స్పీడ్ మీద దూసుకుపోతుంది. ఇక దాదాపుగా 25 వీఎఫ్ ఎక్స్ కంపెనీలు శాతకర్ణికి విజువల్ గ్రాఫిక్స్ అందిస్తున్నాయి అంటే ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఇట్టే అర్ధం అయిపోతుంది. అయితే ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాని ఎలా అయినా…సంక్రాంతి బరిలో  నిలుపుతాను అని క్రిష్ చెప్పాడు…అదే క్రమంలో ఏమాత్రం తేడా అనిపించినా సినిమాను వాయిదా వెయ్యడానికి కూడా వెనకాడను అని క్రిష్ చాలా బలంగా చెప్పేసాడు.

ఆ కధ విన్న అభిమానులు కాస్త భయపడ్డ వార్త వాస్తవమే కానీ….ఇప్పుడు ఈ వార్త వింటే మాత్రం నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతారు….ఇంతకీ ఏంటి ఆ వార్త అంటే…శాతకర్ణిగా బాలయ్య రెండు రోజులు ముందే గర్జించడానికి సిద్దం అవుతున్నాడట….ఈ చిత్రాన్ని రెండు రోజులు ముందుకు తీసుకు వచ్చేందుకు భారీ ప్లాన్ లో ఉన్నాడు క్రిష్… అనుకున్న సమయానికి దాదాపు 15-20 రోజుల ముందే గౌతమిపుత్ర శాతకర్ణి ఫస్ట్ కాపీ చేతిలో ఉండేలా ప్రణాళికలు రూపొందించడం.. ప్లాన్ ప్రకారమే పనులు జరుగుతుండడంతో.. సంక్రాంతి సెలవలను పూర్తిగా ఉపయోగించుకునేలా శాతకర్ణిని విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఇక ఈ వార్త వినగానే నందమూరి అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus