వైరల్ అవుతున్న బాలయ్య వచ్చీ రాని హిందీ స్పీచ్

యావత్ తెలుగు చిత్రసీమలో మన ప్రియతమ కథానాయకుడు మరియు రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణకు తెలుగు మరియు సంస్కృతి భాషలపై ఉన్నంత పట్టు కానీ.. భాషా ప్రావీణ్యం కానీ మరెవరికీ లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అటువంటి బాలకృష్ణ స్టేజ్ మీద ఇచ్చే స్పీచ్ లను జనాలు భీభత్సంగా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ.. ఈమధ్యకాలంలో బాలయ్య అనవసరంగా నవ్వులపాలు అవుతున్నాడు. మొన్నామధ్య తన తమ్ముడు హరికృష్ణ మరణం గురించి మాట్లాడుతూ “సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను” అని చెప్పడం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. అన్నయ్య పోతే బాధపడాల్సింది పోయి.. ఇలా సంభ్రమాశ్చర్యానికి గురయ్యానని చెప్పడం ఏంటో అని ఆయన్ని తెగ తిట్టిపోశారు.

ఆ ఇష్యూని జనాలు ఇప్పుడే మరచిపోతుండగా.. బాలయ్య మళ్ళీ మరో స్పీచ్ తో వైరల్ అయ్యాడు. నిన్న తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగంగా ఒక బహిరంగ సభలో ఉపన్యాసం ఇస్తూ “సారే జహాసే అచ్ఛా” అనే మన జాతీయ గీతాన్ని పాడడానికి ప్రయత్నించాడు బాలయ్య. మరి మధ్యలో మర్చిపోయాడో లేక నోరు తిరగలేదో తెలియదు కానీ.. “బుల్ బుల్” దగ్గర ఒకటికి రెండుసార్లు ఆగిపోయి ఏదో అయ్యింది అనిపించాడు. ఆ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus