Balakrishna: ‘జైలర్ 2’ బాలయ్యకి అంతిస్తున్నారా?

రజినీకాంత్ (Rajinikanth) వరుస ప్లాపుల్లో ఉన్న టైంలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar)  ‘జైలర్’ (Jailer) తో పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆదుకున్నాడు. ఈ సినిమా కథ రజినీ ఏజ్ కి ఇమేజ్ కి బాగా సెట్ అయ్యింది. అలాగే ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ స్టార్ మోహన్ లాల్ ల (Mohanlal) కేమియోలు కూడా హైలెట్ అయ్యాయి. అయితే సౌత్ నుండి అందరి స్టార్స్ నటించినప్పుడు టాలీవుడ్ నుండి ఏ స్టార్ ని తీసుకోకపోవడానికి గల కారణం ఏంటి?

Balakrishna

అనే చర్చ కూడా అప్పుడు బలంగా నడిచింది. ముఖ్యంగా శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) పాత్రకు బాలకృష్ణ (Nandamuri Balakrishna)  వంటి స్టార్ ను తీసుకోవచ్చు కదా అని అంతా అనుకున్నారు. వాస్తవానికి ‘జైలర్’ లో బాలకృష్ణ కోసం ఓ పోలీస్ రోల్ డిజైన్ చేసినట్లు దర్శకుడు నెల్సన్ తెలిపారు. కొన్ని కారణాల వల్ల తర్వాత ఆ పాత్ర వద్దనుకున్నట్టు చెప్పుకొచ్చారు.

అయితే ‘జైలర్ 2’ కూడా వస్తుంది కాబట్టి.. ఇందులో బాలయ్య ఉంటే బాగుంటుంది అని తమిళ ప్రేక్షకులు కూడా అభిప్రాయ పడ్డారు. దీంతో నెల్సన్ ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుని బాలయ్య కోసం ఓ స్పెషల్ రోల్ డిజైన్ చేశారు. సినిమాలో 10 నిమిషాల పాటు ఆ రోల్ ఉంటుందట. అందులో ఒక ఫైట్ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఈ పాత్ర కోసం బాలకృష్ణ ఏకంగా రూ.22 కోట్లు పారితోషికం అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus