Balakrishna, Ravi Teja: బాలయ్య రవితేజలను ఆ డైరెక్టర్ కలుపుతారా?

గత కొన్నేళ్లుగా బాలయ్య రవితేజ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఒక హీరోయిన్ వల్ల వీళ్లిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో ద్వారా అటు బాలయ్య ఇటు రవితేజ వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆ వార్తలను అభిమానులు నమ్మవద్దని క్లారిటీ ఇచ్చారు. అయితే రాబోయే రోజుల్లో బాలయ్య రవితేజ కాంబోలో మూవీ రానుందని సమాచారం అందుతోంది.

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలయ్య హీరోగా ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా మల్టీస్టారర్ గా తెరకెక్కనుందని బాలయ్య రవితేజ ఈ సినిమాలో కలిసి నటిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే అధికారిక ప్రకటన వస్తే మాత్రమే ఈ వార్తలో నిజానిజాలు తెలిసే ఛాన్స్ ఉంటుంది. రవితేజ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఇప్పటికే రాజా ది గ్రేట్ సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

అనిల్ రావిపూడి అడిగితే బాలయ్య సినిమాలో నటించడానికి రవితేజ నో చెప్పే ఛాన్స్ అయితే ఉండదు. ఇప్పటికే చిరంజీవి రవితేజ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతోంది. బాలయ్య తో తెరకెక్కించే సినిమాలో కూడా ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉండే విధంగా అనిల్ రావిపూడి జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది.

భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. వరుస విజయాలతో క్రేజ్ పెంచుకుంటున్న అనిల్ రావిపూడి బాలయ్యకు కూడా బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus