Balakrishna, Boyapati Srinu: ఏపీ స్కీమ్స్ ను బోయపాటి టార్గెట్ చేయనున్నారా?

బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఘన విజయం సాధించాయనే సంగతి తెలిసిందే. బాలయ్య పాపులారిటీని పెంచే విధంగా సినిమాలను తెరకెక్కించే దర్శకుడు బోయపాటి శ్రీను మాత్రమేనని ఫ్యాన్స్ భావిస్తారు. ఈ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుందని కొన్నిరోజుల క్రితమే వార్తలు వచ్చాయి. పొలిటికల్ స్క్రిప్ట్ తో బోయపాటి శ్రీను బాలకృష్ణతో సినిమాను తెరకెక్కించనున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ స్కీమ్స్, వర్తమాన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

2023 ఏప్రిల్ నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని ఏపీలో ఎన్నికలను బట్టి ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మార్పు ఉండే అవకాశం అయితే ఉందని ప్రచారం జరుగుతోంది. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడతాయి. ఈ సినిమాకు నిర్మాత ఎవరనే సంగతి తెలియాల్సి ఉంది. పొలిటికల్ అంశాలను కథలో అంతర్లీనంగా సరైన విధంగా చొప్పిస్తారని బోయపాటి శ్రీనుకు ఇండస్ట్రీలో పేరుంది. టీడీపీకి బెనిఫిట్ కలిగే విధంగా ఈ సినిమా ఉండనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాను పూర్తి చేసి బాలయ్య ఈ సినిమాపై దృష్టి పెట్టనున్నారని సమాచారం. 2024 ఎన్నికలకు ముందు ఈ సినిమా విడుదలైతే ఈ సినిమాకు పొలిటికల్ గా కూడా బెనిఫిట్ కలుగుతుందనే సంగతి తెలిసిందే. బాలయ్య కోసం బోయపాటి శ్రీను ఇప్పటికే పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని తెలుస్తోంది. త్వరలో ఈ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా ఘన విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు విడుదలయ్యే విధంగా బాలయ్య కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus