Balakrishna: మళ్ళీ బాలయ్యను రెచ్చగొట్టిన అభిమాని.. వైరల్ అవుతున్న వీడియో..!

నందమూరి కుటుంబంలో నిన్న విషాదం చోటు చేసుకుంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చిన్న కూతురు , బాలకృష్ణ సోదరి అయిన కంటమనేని ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. దీంతో నందమూరి కుటుంబ సభ్యులతో పాటు నందమూరి అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉమా మహేశ్వరి స్వగృహంలో ఉన్న పార్థీవ దేహాన్ని సందర్శించేందుకు నందమూరి కుటుంబ సభ్యులు, బంధువులు, సినీ ప్రముఖుల అందరూ జూబ్లీ హిల్స్ లో ఉన్న ఆమె ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ కూడా అక్కడికి వెళ్లి చాలా సమయం గడిపారు. బాలయ్య భార్య వసుంధర అక్కడే ఉండగా..

బాలయ్య మాత్రం ఏదో పని పై బయటకు వెళ్ళడానికి కారు వద్దకు వెళ్ళాడు. ఆయన చుట్టూ మీడియా వారు కెమెరాలు పట్టుకుని తిరగడాన్ని మనం చూడవచ్చు. అయితే ఇంత విషాదకర పరిస్థితుల్లో కూడా బాలయ్య ని ఓ అభిమాని సెల్ఫీ కోసం పిలిచాడు. సొంత సోదరి చనిపోయిందన్న బాధలో బాలయ్య ఉండగా అతన్ని సెల్ఫీ కోసం ఆ అభిమాని ఎలా పిలిచాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. బాలయ్య కూడా ఆ టైంలో రచ్చ చేయడం ఎందుకు అన్నట్టు కామ్ గా కారు ఎక్కి వెళ్ళిపోయాడు.

అభిమానుల పై బాలయ్య చెయ్యి చేసుకుంటాడు అంటూ చాలా మంది సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటారు. ‘ఇలా అర్థం పర్థం లేకుండా ప్రవర్తిస్తే బాలయ్యకి కోపం రాదా మరి’ అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘ఆ అభిమాని టైం బాగుంది’ అని కూడా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus