‘కథానాయకుడు’ నష్టాల్ని ‘మహానాయకుడు’ తో తీర్చాలని చూస్తున్న బాలయ్య..!

ఎన్నోఅంచనాల మధ్య… సంక్రాంతి కానుకగా విడుదలైన బాలకృష్ణ – క్రిష్ ల ‘ఎన్టీఆర్ – క‌థానాయ‌కుడు’ చిత్రం ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలింది. మంచి రివ్యూలు, మౌత్ టాక్ వచ్చినా… కలెక్షన్స్ పరంగా నిరాశపరిచింది. మొదటి రోజు నుండీ కలెక్షన్స్ డ్రాప్ అవుతూ వస్తూ డిస్ట్రిబ్యూటర్స్ ని భయపెట్టింది. ఫస్ట్ వీకెండ్ లో నే బయ్యర్లకు భారీ నష్టాలు రావడం ఖాయమని తేల్చేశారు ట్రేడ్ పండితులు. ఈ నేపధ్యంలో నిర్మాత అయిన బాలకృష్ణ, సహా నిర్మాత అయిన సాయి కొర్రపాటి ఈ చిత్రం ద్వారా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ ని ఆదుకోవాలని భావిస్తున్నారట.

ఎన్టీఆర్ – కథానాయకుడు’ చిత్రానికి 70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పుడు నష్టం ఎంతనేది చూస్తే… 50 కోట్లు అని తేలిందట. అంటే కేవలం ఈ చిత్రం 20కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టిందన మాట. దీంతో ఇంత భారీ నష్టాన్ని తీర్చలేక…’ఎన్టీఆర్ – మహానాయకుడు’ చిత్రాన్ని వారికి పైసా తీసుకోకుండా నష్టపరిహారంగా ఇవ్వబోతున్నట్టు తాజా సమాచారం. బాలయ్య తీసుకున్న ఈ నిర్ణయంతో డిస్ట్రిబ్యూటర్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తుంది. ఇక సెకండ్ పార్ట్ లో ‘ఎన్టీఆర్’… పూర్తి రాజకీయ జీవితం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని భావిస్తున్నారట. ముందుగా ‘ఎన్టీఆర్ – మహానాయకుడు’ చిత్రాన్ని పిభ్రవరి 7 న విడుదల చేయాలని భావించినప్పటికీ… మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని ఫిబ్రవరి 14 న విడుదల చేయాలని.. క్రిష్ బాలయ్యను కోరాడట. దీనికి బాలయ్య కూడా అంగీకరించినట్టు తెలుస్తుంది.

ఈ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ లా 50 కోట్ల షేర్ ను రాబట్టినా.. బయ్యర్లు సేఫ్ అయిపోతారు. అయితే ఒక పక్క ‘వైఎస్ఆర్ బయోపిక్’ అయిన ‘యాత్ర’ కూడా పోటీగా ఉంది. ఇదిలా ఉండగా ఫిబ్రవరి లో రిలీజ్ అయ్యే తెలుగు సినిమాలు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడం చాలా కష్టం. ఒక్క ప్రభాస్ ‘మిర్చి’ తప్ప… గత 6 ఏళ్ళుగా ఏ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ గా నిలవలేకపోయింది. జూ.ఎన్టీఆర్ ‘టెంపర్’ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా.. బ్రేక్ ఈవెన్ సాధించడానికి అష్ట కష్టాలు పడింది. మరి ఇలాంటి.. ఫిబ్రవరి నెలలో విడుదల కాబోతున్న ‘ఎన్టీఆర్ – మహానాయకుడు’ చిత్రం ఎంత వరకూ కలెక్ట్ చేస్తుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus