బోయపాటి సినిమా కోసం కొత్త లుక్ లో అదరగొడుతున్న బాలయ్య

  • January 20, 2020 / 03:14 PM IST

తన సినిమాల్లో నటించే విలన్స్ కు మాత్రమే కాదు హీరోలకు కూడా పూర్తిస్థాయి మేకోవర్ ఇస్తాడు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ “లెజెండ్” సినిమాలో బాలయ్య. ఆ సినిమాలో బాలయ్య స్టైల్ చూసి ఆల్మోస్ట్ అందరు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మరోమారు బాలయ్యకు ఆదేస్థాయి మేకోవర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు బోయపాటి. నిన్న ఓ ప్రయివేట్ ఫంక్షన్ కు హాజరైన బాలయ్యను చూసి జనాలందరూ షాక్ అయ్యారు. నీట్ గా గుండు గీయించుకొని మీసాలతో కనిపించిన బాలయ్య లుక్ కు సోషల్ మీడియాలో భీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. క్యాజువల్ లుక్కే ఇలా ఉందంటే.. ఇక సినిమాలో ఇంకే స్థాయిలో ఉంటుందో అని నందమూరి అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు.

ఇకపోతే.. ఈ సినిమాలో హీరోయిన్స్ గా బాలీవుడ్ భామలను ట్రై చేస్తున్నప్పటికీ ఎందుకో సెట్ అవ్వడం లేదు. దాంతో తమిళ లేదా కన్నడ హీరోయిన్ ను ట్రై చేయాలనుకుంటున్నాడు బోయపాటి. ఇటీవల తన తల్లి ఆకస్మిక మరణంతో మెంటల్ గా డిస్టర్బ్ అయిన బోయపాటి.. ఆ డిప్రెషన్ నుండి బయటపడగానే షూటింగ్ మొదలెడతారు.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus