ఛి ఛి… నేను మాట్లాడటమేంటి : నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ అలాగే మెగా బ్రదర్ నాగబాబుల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి, నాగార్జున లతో పాటు దిల్ రాజు, అల్లు అరవింద్ వంటి వారు .. ఆగిపోయిన షూటింగ్ ల విషయమై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సమావేశాలు జరిపారు. చిరంజీవి ఇంట్లో ఈ సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది. అంతే కాదు ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ను కూడా కలిసి మాట్లాడారు. అయితే ఈ మీటింగ్ లకు తనను పిలవలేదు అనే ఉద్దేశంతో.. బాలయ్య ఫైర్ అయ్యాడు. ‘తలసానితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారా? భూములను పంచుకుంటున్నారా? ఒక్క మీటింగ్ కు కూడా నన్ను పిలవలేదు’ అంటూ బాలయ్య తన కోపాన్ని వ్యక్తం చేసాడు.

దీని పై నాగబాబు స్పందిస్తూ.. ‘బాలయ్య నోరు అదుపులో పెట్టుకోవాలి’ అంటూ సెటైర్లు వేసాడు. ఇక నాగబాబు కామెంట్స్ పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలయ్య స్పందించాడు. “ఛి ఛి… నేనేం మాట్లాడను. అతనే మాట్లాడుతున్నాడు. నేను అస్సలు మాట్లాడను. నేను మాట్లాడటమేంటి? ఏముంది మాట్లాడటానికి. ఇండస్ట్రీ అంతా ఇవాళ నాకు సపోర్ట్‌గా వస్తున్నప్పుడు నేనెందుకు మాట్లాడాలి’’ అంటూ బాలయ్య విరుచుకుపడ్డాడు.

అయితే బాలయ్య కామెంట్స్ పై ఇండస్ట్రీలో కొంతమంది స్పందిస్తున్నారు. ‘మీటింగ్ లకు పిలవకపోవడం కరెక్ట్ కాకపోవచ్చు కానీ.. మీటింగ్ లకు ప్రత్యేకంగా ఎవ్వరినీ ఆహ్వానించలేదు. చొరవ చేసుకుని వాళ్ళే వచ్చారు’ అంటూ నిర్మాత మరియు బాలయ్య సన్నిహితుడైన సి.కళ్యాణ్ స్పందించారు.


రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus